ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఈపీఎఫ్ఓ అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా యాక్టివ్ పీఎఫ్ అకౌంట్ ఉండి ఉద్యోగంలో ఉన్నవారికి ఏకంగా రూ.7 లక్షల లైఫ్ ఇన్యూరెన్స్ అందిస్తోంది.
సాధారణంగా లైఫ్ ఇన్యూరెన్స్ పొందాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈపీఎఫ్ఓ అందించే జీవిత బీమాకు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు.
ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగంలో ఉండగా. ఉద్యోగి మరణించిన సమయంలో కుటుంబ సభ్యులు లేదా నామినీకి రూ.7 లక్షల వరకు అందిస్తారు. ఈ స్కీమ్ ఎప్పటినుంచో అమలవుతోంది.
సగటు నెలసరి జీతం గరిష్టంగా రూ. 15 వేలు ఉండాలి. సగటు నెలసరి వేతనాలకు 35 రెట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోని సగటు నిల్వలో 50% కలిపి ఎంత బీమా వస్తుందనేది లెక్కిస్తారు.ఉద్యోగి మరణించిన నెలకి ముందున్న 12 నెలల కాలంలోని సగటు నెలసరి వేతనాలతో ముడిపడి ఉంటుంది.
ఒక ఉద్యోగి సగటు నెలసరి వేతనం రూ.15 వేలు ఉంటే రూ.5.25 లక్షలు కుటుంబానికి అందుతాయి. ఇక ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా కూడా ఈ లెక్కింపు జరుపుతారు. పీఎఫ్ బ్యాలెన్స్ ఎక్కువుంటే రూ.7 లక్షల వరకు పొందవచ్చు.
కనీసం రూ.2.5 లక్షల వరకు పొందే అవకాశముండగా.. గరిష్టంగా రూ.7 లక్షలు పొందవచ్చు. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న ప్రతీఒక్కరూ ఈ బీమా కవరేజ్ కిందకు వస్తారు
మీ వేతన పరిమితికి లోబడి యజమాని నిర్దేశించిన రేటు ప్రకారం ఈ స్కీమ్‌కు చెల్లిస్తారు. ఉద్యోగి నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ తీసుకోరు. మరణించిన సభ్యుడు మరణించిన నెల కంటే ముందు 12 నెలల పాటు నిరంతరం ఉద్యోగంలో ఉండాలి.
ఈ 12 నెలల కాలంలో సభ్యుడు వేరే సంస్థకు మారినప్పటికీ.. వర్తించే షరతులకు లోబడి నిబంధనలు ఈ ప్రయోజనాన్ని అనుమతిస్తాయి. 12 నెలల పాటు సర్వీస్ చేయకపోతే పీఎఫ్ అకౌంట్లోని సగలు నిల్వ ఆధారంగా ప్రయోజనం కల్పిస్తారు.
నామినీ లేదా చట్టపరమైన వారసుడు అవసరమైన పత్రాలతో EPFO ద్వారా డెత్ క్లెయిమ్ దాఖలు చేయాలి. EPFO దానిని ధృవీకరించి చెల్లింపు చేస్తుంది