చిటికెలో రైల్వే జనరల్ టికెట్ బుక్ చేస్కోండి.

Venkatrao Lella

Images: Pinterest

23 August 2026

రైళ్లల్లో జనరల్ టికెట్లను బుక్ చేసుకునేందుకు రైల్ వన్ యాప్‌ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చోవాల్సిన అవసరం ఉండదు.

మీ చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ ద్వారా క్షణాల్లోనే అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ క్యూఆర్ కోడ్ టికెట్ ద్వారా రైళ్లల్లో ప్రయాణం చేయవచ్చు.

బుక్ చేసుకునేందుకు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేస్తే 3 శాతం డిస్కౌంట్ కూడా రైల్ వన్ యాప్‌లో పొందవచ్చు. క్యూఆర్ కోడ్ రైల్వే స్టేషన్లలో స్కాన్ చేసి అనంతరం ట్రైన్ ఎక్కవచ్చు.

రైల్ వన్ యాప్‌లో టికెట్ బుకింగ్‌కు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశముంది. ఇలా చేస్తే 3 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

చెల్లింపులు చేసే సమయంలో ఆటోమేటిక్‌గా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రూ.10 నుంచి రూ.150 రూపాయల్లోపు ఉండే జనరల్ టికెట్లకు సైతం ఆ ఆఫర్ వర్తిస్తుంది. మీరు స్టేషన్‌కు వెళ్లే ముందు కూడా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మీరు టికెట్ బుకింగ్ చేసుకోగానే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దీనిని రైల్వే స్టేషన్‌లో స్కాన్ చేసి అనంతరం ట్రైన్ ఎక్కవచ్చు.

రైల్వే కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. క్యూలైన్లలో నిల్చోని టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా సులువుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

రైల్ వన్ యాప్ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. దీంతో గ్రామీణ ప్రజలు కూడా సులువుగా తమ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

రైల్ వన్ యాప్‌లో జనరల్ టికెట్‌తో పాటు రిజర్వుడు, తత్కాల్ టికెట్లు, ఫ్లాట్ ఫామ్ టికెట్లు కూడా పొందవచ్చు. ఇక ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు.