ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్.. రూ.30 లక్షల హవాలా డబ్బుతో అడ్డంగా బుక్కయిన యువకుడు!
ప్రియురాలికి పంపిన సరదా ప్రాంక్ మెసేజ్ ఒక యువకుడిని చిక్కుల్లో పడేసింది. ఈ మెసేజ్‌తో అప్రమత్తమైన కేపీహెచ్‌బీ పోలీసులు ఇండీస్ వన్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా, ₹30 లక్షల హవాలా నగదు బయటపడింది. సుమంత్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి ఈ డబ్బును కూడబెట్టాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సరదాగా ప్రియురాలికి పంపిన ఒక ప్రాంక్ మెసేజ్, ₹30 లక్షల హవాలా నగదును బయటపెట్టింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇండీస్ వన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సుమంత్, మనోజ్, గౌతమ్ అనే ముగ్గురు యువకులు మద్యం సేవించిన అనంతరం, సుమంత్ తన ప్రియురాలికి ఒక ప్రాంక్ మెసేజ్ పంపాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ మెసేజ్ చేయడంతో కంగారుపడిన యువతి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇండీస్ వన్ అపార్ట్‌మెంట్‌లోని వారి ఫ్లాట్‌కు చేరుకున్నారు. అక్కడ సోదాలు నిర్వహించగా, ఓ బ్యాగులో అక్షరాలా ₹30 లక్షల నగదు బయటపడింది. నగదు చూసి షాక్ అయిన పోలీసులు ముగ్గురు యువకులను ప్రశ్నించగా, తమకు ఏమీ తెలియదని దాటవేయడానికి ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ముగ్గురితో పాటు నగదును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ డబ్బు క్రికెట్ బెట్టింగ్‌లకు సంబంధించినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బు మూలం, గమ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి?
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

