ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల తేదీలను ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. సెప్టెంబర్ 15న రెండో దశలో 3,231 పోస్టులు, అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టులు, ఆ తర్వాత చివరి దశలో 2,995 పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.