స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనే తొలగింపుపై నిర్మాత ప్రణయ్ వంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీపికా పది శాతం లాభాల వాటా అడిగిందని ప్రణయ్ వంగా తెలపగా, దీనిపై ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దీపికా లైక్ కొట్టి మద్దతు పలికారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.