Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారందరికీ బిగ్ అలర్ట్.. నేడే లాస్ట్ డేట్.. వెంటనే చేస్కోండి..
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. అయితే మీకో హెచ్చరిక. ఈ రోజుతో ఈ పని పూర్తి చేయకపోతే గ్యాస్ బుకింగ్ చేసుకోలేరు. అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో పడదు. ఈ రోజు రాత్రి 12 వరకు మాత్రమే సమయం ఉంది.

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఈకేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గ్యాస్ ఎవరి పేరుపై ఉందో.. వాళ్లు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. ఇందుకోసం ఆగస్ట్ 23వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆగస్ట్ 16వ తేదీతో గడువు ముగియగా.. చాలామంది ఇంకా పూర్తి చేయకపోవడంతో ఆగస్ట్ 23 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో నేడే లాస్ట్ డేట్‌గా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఇంకా పూర్తి చేయనివారు వెంటనే పూర్తి చేయడం మంచిది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. కేవైసీ పూర్తి చేయనివారికి ఆయిల్ కంపెనీలు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్ రూపంలో మెస్సేజ్‌లు పంపుతున్నాయి. వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
కేవైసీ ప్రాసెస్ ఎలా..?
కేవైసీ పూర్తి చేయడానికి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, మొబైల్ నెంబర్, బయోమెట్రిక్స్ అవసరం పడతాయి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మీ ముఖం స్కాన్ చేయడం లేదా వేలిముద్రలు వేయడం వల్ల కేవైసీ పూర్తి చేయవచ్చు. మీరు ఇది పూర్తి చేయడానికి గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే మొబైల్ ద్వారా పూర్తి చేయవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.
మొబైల్ ద్వారా పూర్తి చేయడం ఎలా..?
మీరు హెచ్‌పీ గ్యాస్ వాడుతుంటే.. హెచ్‌పీ పే యాప్, ఇండేన్ గ్యాస్ ఉపయోగిస్తుంటే ఇండియన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కనెక్షన్ వాడుతుంటే హలో బీపీసీఎల్ యాప్‌లు ముందుగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ ఫేస్‌ఆర్డీ యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన మొబైల్ యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం హోం పేజీలో కనిపించే కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేసి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీ ఫేస్ స్కాన్ చేయాలి. అనంతరం కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
పూర్తి చేయకపోతే ఏమవుతుంది..?
గ్యాస్ ఈకేవైసీ పూర్తి చేయకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. గ్యాస్ బుకింగ్స్ నిలిచిపోయే అవకాశముంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీలు కూడా నిలిచిపోతాయి. దీంతో కేవైసీ వెంటనే పూర్తి చేయడం వల్ల గ్యాస్ సేవల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు.
