కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడులో పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం దీనిని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.