AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, సమయం లేని ఆహార అలవాట్ల వల్ల నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు కేవలం పురుషులకే వస్తుందనే భావన ఉండేది. కానీ, ప్రస్తుతం మహిళల్లోనూ హార్ట్ ఎటాక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గుండెపోటు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది ఛాతీలో తీవ్రమైన నొప్పి. అయితే, మహిళ విషయానికి వస్తే ఇది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. మహిళల్లో గుండెపోటు సంకేతాలు చాలా భిన్నంగా, సాధారణ అనారోగ్య లక్షణాల్లా కనిపిస్తాయి. దీనివల్ల చాలామంది వాటిని గుర్తించలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

Jyothi Gadda
|

Updated on: Sep 08, 2026 | 5:32 PM

Share
ఎటువంటి కష్టమైన పని చేయకపోయినా లేదా తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నిస్సత్తువ, అలసట ఆవహిస్తే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఛాతీలో ఎలాంటి నొప్పి లేకపోయినా ఊపిరి ఆడకపోవడం, పరుగెత్తినట్లు లేదా ఆయాసంగా అనిపించడం మహిళల్లో గుండె సమస్యకు ప్రధాన సంకేతం.

1 / 5
గుండెపోటు నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా దవడలు, గొంతు, మెడ, వెనుక భాగం లేదా భుజాలకు పాకే అవకాశం ఉంది. కడుపులో తిప్పడం, వాంతులు రావడం, తీవ్రమైన అజీర్తి లేదా కడుపులో మంట వంటి లక్షణాలను చాలామంది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి పొరబడతారు. కానీ, ఇవి కూడా హార్ట్ ఎటాక్ సూచనలే.

2 / 5
వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా చల్లని చెమటలు పట్టడం, కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పిపోతున్నట్లు అనిపించడం ప్రమాదకరమైన సంకేతం. ఈ లక్షణాలను సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం ప్రాణాలకే ప్రమాదకరం.

3 / 5
ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?: మహిళలు తరచుగా తమ ఆరోగ్యం కంటే కుటుంబ సభ్యుల సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్నపాటి నొప్పులు లేదా అసౌకర్యం కలిగినప్పుడు ఏమీ కాదులే అని సర్దుకుపోతుంటారు. కానీ, గుండెపోటు విషయంలో ప్రతీ నిమిషం చాలా విలువైనది. సరైన సమయానికి వైద్య సహాయం అందకపోతే గుండె కండరాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

4 / 5
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువు ఉన్న మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. నలభై ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు  చేయించుకోవడం మంచిది. పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా అకస్మాత్తుగా కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం లేదా సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించడం శ్రేయస్కరం.

5 / 5
Follow Us