సింగర్ ఝాన్సీ వ్యవసాయంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. 2016 నుండి, తొమ్మిదో తరగతి నుంచే తాను వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. నాన్న ఒక్కరే కష్టపడుతుండటం చూసి, అలాగే ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా తానూ, తమ్ముడూ సాగు పనుల బాధ్యత తీసుకున్నామన్నారు. వరి పండిస్తామని, పొలం దున్నడం నుండి కోతల వరకు అన్ని పనులూ తెలుసని ఝాన్సీ వెల్లడించారు.