తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో ఒంటరి ఏనుగు తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని పంట పొలాల్లో ప్రవేశించి పెద్ద ఎత్తున పంటలను ధ్వంసం చేస్తోంది. దీంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు తీవ్రంగా భయపడుతున్నారు. వెంటనే స్పందించి ఏనుగును దట్టమైన అడవిలోకి మళ్లించాలని అటవీశాఖ అధికారులను స్థానిక రైతులు వేడుకుంటున్నారు.