AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spinach : సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌ ఇది.. ఆరోగ్యానికి నిధి

మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ పాలకూర నిత్యం మన వంటకాల్లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన సూపర్ ఫుడ్. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. తక్కువ కేలరీలు కలిగి ఉండి, అపారమైన పోషకాలను అందించే పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Spinach : సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌ ఇది.. ఆరోగ్యానికి నిధి
Spinach Health Benefits
Jyothi Gadda
|

Updated on: Sep 08, 2026 | 10:13 PM

Share

పాలకూర శరీరానికి ఎంతో మేలు చేసే అత్యంత పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి. పాలకూర నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే పాలకూర బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మరిన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం..

పాలకూరలో ఐరన్ శాతంతో పాటు విటమిన్ C కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రక్తహీనత సమస్యను నివారిస్తుంది. మహిళలు, గర్భిణులు, పిల్లలు దీనిని తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో లూటిన్, జియాంటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను అడ్డుకుంటాయి. అలాగే దీనిలోని విటమిన్ A రేయింటిరి సమస్యను తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. పాలకూరలో విటమిన్ K, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ K ఎముకలలో కాల్షియం సరిగ్గా ఇంకేలా చేసి, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

దీనిలోని పొటాషియం, నైట్రేట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రక్తనాళాలు సజావుగా పనిచేసేలా చూసి, పక్షవాతం, గుండెపోటు ప్రమాదాన్ని నిరోధిస్తాయి. పాలకూరలో కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే దీనిలోని ఆల్ఫా-లిపోఇక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. పాలకూరను పప్పుగా, కూరగా లేదా జ్యూస్ రూపంలో మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us