AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. మనం తింటున్న జీడిపప్పు నకిలీదా..? కల్తీని కనిపెట్టేందుకు సులువైన చిట్కాలు!

డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పుకి ఉన్న ప్రాధాన్యతే వేరు. పాయసం, స్వీట్లు, మసాలా వంటకాల్లోనే కాకుండా ఆరోగ్యకరమైన స్నాక్‌గా చాలామంది జీడిపప్పును నిత్యం తింటుంటారు. అయితే, ఇటీవల మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి నాసిరకం, కెమికల్స్‌తో ప్రాసెస్ చేసిన, నకిలీ జీడిపప్పుల విక్రయం పెరిగిపోతోంది. రసాయనాలు కలిపిన లేదా బ్లీచ్ చేసిన జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలకు బదులు హాని జరుగుతుంది. అందుకే మీరు కొనే జీడిపప్పు అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఈజీ టిప్స్‌ ఇవే!

ఓరీ దేవుడో.. మనం తింటున్న జీడిపప్పు నకిలీదా..? కల్తీని కనిపెట్టేందుకు సులువైన చిట్కాలు!
Cashew Adulteration
Jyothi Gadda
|

Updated on: Sep 08, 2026 | 9:45 PM

Share

మార్కెట్‌లో లభించే జీడిపప్పులో కల్తీ, బ్లీచింగ్ రసాయనాలు, నిల్వ ఉంచిన నాసిరకం పప్పులు పెరిగిపోతున్నాయి. నిజమైన జీడిపప్పును గుర్తించడం చాలా సులభం. చాలామంది జీడిపప్పు ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని భావిస్తారు, కానీ అది పొరపాటు! అసలైన, నాణ్యమైన జీడిపప్పు సహజ సిద్ధమైన ఐవరీ లేదా లేత పసుపు/క్రీమ్ రంగులో ఉంటుంది. పప్పులు మరీ తెల్లగా, మెరుస్తూ ఉంటే వాటిని వేగంగా ఆకర్షణీయంగా మార్చడానికి బ్లీచింగ్ ఏజెంట్లు లేదా రసాయనాలను ఉపయోగించారని అర్థం.

స్వచ్ఛమైన జీడిపప్పు సహజమైన జీడి గింజ ఆకారంలో ఉండి, వంకీ తిరిగి ఉంటుంది. ఒకే ప్యాకెట్‌లోని పప్పులన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. అలా కాకుండా ప్యాకెట్‌లోని ప్రతీ పప్పు అతిగా మెరుస్తూ, ఒకే సైజు, ఆకారంలో ఉంటే అవి పిండితో లేదా ప్రాసెస్ చేసి తయారుచేసిన కృత్రిమ పప్పులు కావచ్చు.

ఇంట్లోనే నిజమైన జీడిపప్పును గుర్తించడానికి ఇది సులభమైన పద్ధతి. ఒక గ్లాసు నీటిలో 3-4 జీడిపప్పులను వేయండి. అసలైన జీడిపప్పు గట్టిగా, బరువుగా ఉండటం వల్ల నీటి అడుగుభాగానికి మునుగుతుంది. ఒకవేళ పప్పు నీటిపై తేలితే, అది బోలు పప్పు అని లేదా రసాయనాలు కలిపిన నకిలీ జీడిపప్పు అని గ్రహించాలి.

ఇవి కూడా చదవండి

అసలైన జీడిపప్పును నమిలినప్పుడు అది సహజమైన తీపి, క్రీమీ రుచితో కూడి ఉంటుంది. తేలికపాటి క్రంచ్ ఇస్తుంది. పప్పు మరీ గట్టిగా ఉండి, నములుతుంటే చేదుగా లేదా రుచి లేకుండా ఉంటే అది పాత పప్పు లేదా కల్తీ పప్పు అని అర్థం. తాజా జీడిపప్పును వాసన చూస్తే తేలికపాటి, ఆహ్లాదకరమైన సువాసన వస్తుంది. పప్పు నుండి నూనె వాసన, నిల్వ ఉంచిన బూజు వాసన లేదా రసాయనాల కేమికల్ స్మెల్ వస్తుంటే వాటిని అస్సలు కొనకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు నాణ్యమైన, అసలైన జీడిపప్పును ఎంచుకుని మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us