AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. భార్య, చెల్లెలిని కాల్చి చంపాడు.. చివరికి..

విషాదం.. భార్య, చెల్లెలిని కాల్చి చంపాడు.. చివరికి..

Phani CH
|

Updated on: Aug 23, 2026 | 6:16 PM

Share

లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విడాకుల వివాదం, ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న సోదరిని కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భరణం డిమాండ్, కుటుంబ కలహాలే ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

లక్నోలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆగస్టు 20 గురువారం నాడు ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, తోడబుట్టిన సోదరిని దారుణంగా కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గోమతి నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న దివ్య మిశ్రా అనే మహిళను ఆమె భర్త మానస్ వాజ్‌పేయ్ కాల్చి చంపాడు. ఈ హత్య అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిన నిందితుడు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన 28 ఏళ్ల చెల్లెలిని కూడా హతమార్చాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అతడూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ హత్యలకు ఆర్థిక వివాదాలు, ముఖ్యంగా విడాకుల ప్రక్రియే ప్రధాన కారణమని తెలుస్తోంది. మానస్, దివ్య దంపతులు పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. గత ఏడాదిన్నర కాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన దివ్య, సెటిల్‌మెంట్‌లో భాగంగా కోటి రూపాయల భరణం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య జరగడానికి కేవలం రెండు రోజుల ముందే ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే భరణం అంశంపై ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరినట్లు సమాచారం. మరోవైపు, కుటుంబ కలహాలపై దివ్య సోదరి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. మానస్ చిన్న చిన్న విషయాలకే దివ్యను వేధించేవాడని తెలిపారు. కాగా, ఆత్మహత్య చేసుకునే ముందు నిందితుడు తన వాట్సాప్‌లో భార్యను, చెల్లెలిని చంపినట్లు ఒక స్టేటస్ పెట్టడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pizza: పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్‌ పడింది.. అట్లుంటదిమరి కస్టమర్స్‌తో పెట్టుకుంటే..

ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు.. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు!

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్! భారీగా తగ్గిన ఎయిర్‌పోర్ట్ ఫీజు

ఇస్రో సంచలన నిర్ణయం.. ఇకపై రాకెట్ల తయారీకి గుడ్‌ బై

Sugar Price: ఘాటెక్కిన చక్కెర.. పండగ వేళ సామాన్యులకు చుక్కలు

Follow Us