AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ ఇంత సింపులా.. ఇలా చేస్తే చాలు వద్దన్నా జుట్టు పెరిగిపోతుంది..

జుట్టు రాలడం, చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వంటి సమస్యలు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే సరైన ఆహారం, తగినంత ప్రోటీన్లు, హార్మోన్ల సమతుల్యత, ఒత్తిడి నియంత్రణ, తగిన నిద్ర, పరిశుభ్రమైన హెయిర్ కేర్ అలవాట్లు పాటించడం ద్వారా జుట్టును బలంగా, ఒత్తుగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి జుట్టు ఆరోగ్యానికి కీలకమని వారు చెబుతున్నారు.

ఓర్నీ ఇంత సింపులా.. ఇలా చేస్తే చాలు వద్దన్నా జుట్టు పెరిగిపోతుంది..
Diet For Hair Growth
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2026 | 3:33 PM

Share

అందంగా కనిపించడానికి జుట్టు చాలా ముఖ్యం.. అందుకే.. జుట్టు అంటే అందరికీ చాలా ఇష్టం.. వృద్ధాప్యం వచ్చే వరకు ఒత్తుగా, నల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, ఆధునిక జీవనశైలి, వాతావరణ మార్పుల కారణంగా జుట్టు రాలడం, చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. గత 15 ఏళ్లలో ఈ సమస్యలలో గణనీయమైన మార్పులు వచ్చాయని, ప్రస్తుతం 8-10 ఏళ్ల పిల్లలకు కూడా తెల్లజుట్టు వస్తోందని ప్రముఖ హెయిర్ కేర్ నిపుణులు పేర్కొంటున్నారు. 14 ఏళ్ల వయసుకే అబ్బాయిలలో బట్టతల, అమ్మాయిలలో జుట్టు విపరీతంగా రాలడం ఆందోళన కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సమస్యలకు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, వాతావరణ పరిస్థితులు, తరాలవారీగా వచ్చే జన్యు మార్పులు వంటి అనేక కారణాలున్నాయి. అయితే, సరైన జాగ్రత్తలు, జీవనశైలి మార్పులతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు ఆరోగ్యానికి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు:

సమతుల్య పోషకాహారం:

  • ప్రొటీన్లు: జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతుంది. కాబట్టి ఆహారంలో తగినంత ప్రొటీన్లు తీసుకోవడం అత్యవసరం. పప్పులు (వారానికి 4-5 సార్లు), గుడ్లు (రోజుకు ఒకటి), మాంసాహారం (వారానికి 2 సార్లు) తీసుకోవాలి. మాంసం తినని వారు ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి.
  • లెగ్యూమ్స్, మొలకెత్తిన గింజలు: గుగ్గిళ్ళు, స్ప్రౌట్స్, పచ్చిశనగలు, రాజ్మా, బీన్స్ వంటివి ప్రొటీన్ల సమృద్ధిగా అందిస్తాయి. ఆకుకూరలు: పచ్చి ఆకుకూరలు, కూరగాయలు రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.
  • నీరు: తగినంత నీరు తాగడం జుట్టుకు తేమను అందించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, నూనె: కారం, ఉప్పు తక్కువగా, నూనె తగినంతగా వాడాలి.

బరువు నియంత్రణ: అధిక బరువు కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. బరువు పెరిగిన వారిలో జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని గమనించవచ్చు.

హార్మోన్ల సమతుల్యత: అమ్మాయిలలో రెగ్యులర్ పీరియడ్స్ రాకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. హార్మోన్ల అసమతుల్యత జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి, నిద్ర: ఒత్తిడి అనేది ఈ రోజుల్లో అందరి జీవితాల్లో ఒక భాగం. కానీ, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నామా అనేది చాలా ముఖ్యం. తగినంత నిద్ర, ప్రశాంతమైన మనసు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

రక్తహీనత నివారణ (హిమోగ్లోబిన్): మన దేశంలో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సరిగా లేకపోతే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించుకుని, అవసరమైతే చికిత్స తీసుకోవాలి.

విటమిన్లు, ఖనిజాలు: కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. 40 ఏళ్ల తర్వాత ఆహారం ద్వారా ఇవి సరిగా అందకపోతే, డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

డాండ్రఫ్ నియంత్రణ: చుండ్రు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి. డాండ్రఫ్ లేకుండా తలను శుభ్రంగా ఉంచుకోవాలి.

సరైన హెయిర్ కేర్ దినచర్య:

  • తలస్నానం: జుట్టును క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలి.
  • షాంపూ: తక్కువ పరిమాణంలో షాంపూ ఉపయోగించి, పూర్తిగా నీటితో కడిగేయాలి.
  • కండీషనర్: కండీషనర్‌ను జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి, వేర్లకు పెట్టకూడదు.
  • పరిశుభ్రత: జుట్టు బ్యాడ్ స్మెల్ రాకుండా, డాండ్రఫ్ లేకుండా, పేలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

జుట్టుకు బాహ్యంగా ప్రొటీన్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు సిల్కీగా, స్మూత్‌గా తయారవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. అయితే, పైన పూసిన ప్రొటీన్లు జుట్టు వేర్లలోకి వెళ్లి జుట్టు పెరుగుదలకు నేరుగా తోడ్పడలేవని ప్రముఖ న్యూట్రిషనిస్ట్, బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలితారెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఒత్తిడి లేని ప్రశాంత జీవనం జుట్టు ఆరోగ్యానికి కీలకమని ఆమె నొక్కి చెప్పారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. ముందుగా నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us