దేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరో తెలుసా?

Venkatrao Lella

Images: Pinterest

01 July 2026

భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు అనే ప్రశ్న తరచుగా చాలా మంది మనసుల్లో మెదులుతూ ఉంటుంది. చాలామందికి ఆ మహిళ ఎవరనేది తెలియదు. తాజా సమాచారం ప్రకారం..

ఒక జాబితా ప్రకారం.. జిందాల్ గ్రూప్ అధినేత్రి, సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా ఉన్నారు

సావిత్రి జిందాల్ మొత్తం సంపద 39.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. గత 6 నెలల్లో ఆమె నికర ఆస్తి కూడా 4.1 బిలియన్ డాలర్లు పెరిగింది

సావిత్రి జిందాల్ రాజకీయాలు, వ్యాపారం రెండింటినీ నిర్వహిస్తారు. ఆమె వ్యాపారతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు.

సావిత్రి హిసార్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు

జిందాల్ గ్రూప్ ఉక్కు, విద్యుత్, సిమెంట్, మౌలిక సదుపాయాల రంగాలలో బలమైన కంపెనీగా కొనసాగుతోంది. దీంతో ఆమె సంపద కూడా పెరుగుతుంది.

జిందాల్ గ్రూప్‌కు గౌరవ చైర్‌పర్సన్‌గా సావిత్రి జిందాల్ కొనసాగుతున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళల్లో ఆమె తొలిస్థానంలో ఉన్నారు.