ధురంధర్ ఇంపాక్ట్..వాళ్లని వణికిస్తున్న స్పై సబ్జెక్ట్..!
ఒకప్పుడు విజయవంతమైన బాలీవుడ్ స్పై సినిమాలు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయి. దురందర్ సినిమా సృష్టించిన ప్రభా వం ఇతర చిత్రాలపై తీవ్రంగా పడుతోంది. తాజాగా విడుదలైన ఆల్ఫా లాంటి సినిమాలు ప్రేక్ష కులను నిరాశ పరుస్తు న్నాయి. స్పై యూనివర్స్‌కు కొత్త కథనాలు, స్క్రీన్‌ప్లే అనివార్యంగా మారాయి.
బాలీవుడ్లో స్పై సినిమాలు నిర్మించాలంటేనే నిర్మాతలు ఇప్పుడు భయపడుతున్నారు. దురందర్ చిత్రం సృష్టించిన ప్రభావం అటువంటిది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర స్పై చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు, చాలావరకు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారుతున్నాయి. ఈ ప్రభావం ఇంకెన్నాళ్లు ఉంటుందో అనే చర్చ జరుగుతోంది.బాలీవుడ్ స్పై యూనివర్స్ డేంజర్ జోన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో దురందర్ వచ్చింది. ఇది మరో పదేళ్ల వరకు గుర్తుండిపోయే ప్రభావాన్ని సృష్టించింది. కానీ, దురందర్ చూసిన కళ్ళతో మిగిలిన స్పై సినిమాలను ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. తాజాగా విడుదలైన ఆల్ఫా సినిమా దారుణంగా నిరాశపరిచింది. అలియా భట్, శార్వరీ నటించిన ఈ చిత్రం ట్రోలింగ్ మెటీరియల్‌గా మారింది.గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్‌తో మొదలైన ఈ స్పై యూనివర్స్, టైగర్ జిందా హై, పఠాన్, వార్ వంటి చిత్రాలతో బాగానే సాగింది. అయితే, టైగర్ 3 నుంచే హెచ్చరిక గంటలు మోగాయి. ఫైటర్ కూడా అంచనాలు అందుకోలేదు, వార్ 2 కూడా ఫ్లాప్ అయింది.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్లో నయా ట్రెండ్
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు

