AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌

సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌

Samatha J
|

Updated on: Jul 08, 2026 | 12:29 PM

Share

ఒకప్పుడు రీమేక్‌లకే పరిమితమైన బాలీవుడ్, ఇప్పుడు సౌత్ డైరెక్టర్ల మేకింగ్‌ స్టైల్‌, మాస్ పల్స్ కోసం చూస్తోంది. ఉత్తరాది హీరోలు ప్రముఖ దక్షిణాది దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హృతిక్ రోషన్ - పరశురామ్, సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి వంటి క్రేజీ కాంబినేషన్లు ఈ నయా ట్రెండ్‌కు నిదర్శనం. సందీప్ రెడ్డి వంగ, అట్లీ వంటి దర్శకుల విజయాలు దీనికి ఊతమిచ్చాయి.

బాలీవుడ్ పరిశ్రమలో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు దక్షిణాది చిత్రాలను కేవలం రీమేక్‌ల కోసం మాత్రమే చూసిన బాలీవుడ్, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కేవలం కథలకే కాదు, సౌత్ డైరెక్టర్ల ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, వారి మాస్ పల్స్ అక్కడ విజయానికి కీలకమని హిందీ స్టార్స్ నమ్ముతున్నారు. అందుకే బాలీవుడ్ పెద్దలంతా ప్రస్తుతం దక్షిణాది మేకర్స్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో ఒక సినిమా ఓకే అయిన వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో పరశురామ్ స్పెషలిస్ట్. అలాగే బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. హీరో ఎలివేషన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా మిక్స్ చేయడంలో వంశీ పైడిపల్లి దిట్ట. సరైన సక్సెస్ కోసం చూస్తున్న సల్మాన్, ఈ సౌత్ కమర్షియల్ ఫార్ములా తనకు పక్కాగా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్‌తో తీసిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అటు షారుఖ్ ఖాన్‌ను ఊర మాస్ లుక్‌లో చూపిస్తూ అట్లీ తీసిన జవాన్ బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సౌత్ మేకర్స్ దగ్గరున్న మాస్ పల్స్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ బాలీవుడ్ స్టార్స్‌కు కొత్త జోష్ ఇస్తున్నాయి.

Published on: Jul 08, 2026 12:25 PM
Follow Us