AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali : అతడు నాలుగేళ్లు ప్రేమిస్తున్నా అని వెంటపడ్డాడు.. వెంటనే రాఖీ కట్టేశా.. హీరోయిన్ అంజలి..

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగింటి అమ్మాయి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సాధారణ విషయం కాదు. ఎన్నో సవాళ్లు, విమర్శలను ఎదుర్కొని.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో హీరోయిన్ అంజలి ఒకరు. తెలుగు, తమిళం భాషలలో తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది.

Rajitha Chanti
|

Updated on: Jul 09, 2026 | 12:55 PM

Share
Anjali టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ చిత్రాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. గ్లామర్ షో కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగుతోపాటు తమిళంలో స్టార్ హీరోలతో కలిసి పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి బయట బెట్టింది.

1 / 5
2006లో కట్రదు తమిళ్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది అంజలి. మొదటి సినిమాతోనే అధ్బుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఇక షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన అంజల తన నటనతో ఆకట్టుకుంది.

2 / 5
షాపింగ్ మాల్ తర్వాత తెలుగులోనూ ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో అంజలి నటన కట్టిపడేసింది. వెంకీ మరదలిగా తన అందం, అభియనంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. తెలుగులో చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది అంజలి. చివరగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు తమిళంలో మకుటం అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో విశాల్ హీరోగా నటిస్తున్నారు.

3 / 5
అంతేకాదు.. ఈ సినిమాతోనే విశాల్ దర్శకుడిగానూ పరిచయం కాబోతున్నారు.  ఈసినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి.. తన టీనేజీలో ఎదురైన ప్రేమ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. తన క్లాస్ మేట్ ఒకరు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడని.. అందుకు పుల్ స్టాప్ పెట్టాలని భావించి.. అతడంటే ఇష్టం, ప్రేమ లేదని చెప్పానని అన్నారు. దీంతో అతడు ఒప్పుకోలేదని.. ధైర్యం ఉంటే తనకు రాఖీ కట్టాలని సవాలు విసిరాడని గుర్తు చేసుకుంది.

4 / 5
దీంతో వెంటనే  రాఖీ తీసుకెళ్లి అతడికి కట్టేశానని.. కోపంతో ఆ రాఖీని తీసిపారేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాతే అతడు తనకు ఎదురుకాలేదని.. ఇప్పటివరకు తాము కలుసుకోలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి చేసిన కామెంట్స్ సోషళ్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా అంజలి అప్ కమింగ్ సినిమాల గురించి తెలుసుకోవడానికి అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల మకుటం సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

5 / 5
Follow Us