July 5, 2026
Subhash
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ కామన్ అయిపోయింది. అయితే, ఇది నెలకు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో, మీ కరెంట్ బిల్లుపై ఎంత ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
టీవీ స్క్రీన్ సైజ్ పెద్దదవుతున్న కొద్దీ అది తీసుకునే కరెంట్ కూడా పెరుగుతుంది. 32 ఇంచుల టీవీ కంటే 55 లేదా 65 ఇంచుల స్మార్ట్ టీవీలు చాలా ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి.
సాధారణ 43 ఇంచుల స్మార్ట్ టీవీ రోజుకు 5 నుండి 6 గంటలు నడిస్తే, అది నెలకు దాదాపు 15 నుండి 25 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. (ఇది టీవీ బ్రాండ్, మోడల్‌ను బట్టి మారుతుంది).
మీ ప్రాంతంలో యూనిట్ కరెంట్ ధర రూ.6 అనుకుంటే.. కేవలం స్మార్ట్ టీవీ వల్లే నెలకు సుమారు రూ.100 నుండి రూ.200 వరకు బిల్లు వచ్చే అవకాశం ఉంది. పెద్ద స్క్రీన్ టీవీలైతే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది.
చాలామంది టీవీని రిమోట్‌తో మాత్రమే ఆఫ్ చేస్తారు. మెయిన్ స్విచ్ ఆపరు. స్టాండ్‌బై మోడ్‌లో ఉంచడం వల్ల టీవీ నిరంతరం కొద్దిపాటి కరెంట్‌ను లాగుతూనే ఉంటుంది.
స్మార్ట్ టీవీలో బ్రైట్‌నెస్ ఎప్పుడూ 100% ఉంచకూడదు. దీనివల్ల కళ్లకు నష్టం జరగడమే కాకుండా, టీవీ ఎక్కువ కరెంట్ కాలుస్తుంది. ఎనర్జీ సేవింగ్ లేదా ఆటో-బ్రైట్‌నెస్ మోడ్ ఆన్ చేయండి.
టీవీ చూడనప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. టీవీలో ఉండే 'Sleeper Timer' ఫీచర్ ఉపయోగించండి. అవసరం లేనప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ లేదా యాప్స్ రన్ అవ్వకుండా చూసుకోండి.
మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఎప్పుడూ 4-స్టార్ లేదా 5-స్టార్ BEE రేటింగ్ ఉన్న టీవీలనే ఎంచుకోండి. ఇవి సాధారణ టీవీల కంటే దాదాపు 30% వరకు విద్యుత్‌ను ఆదా చేస్తాయి.