AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యజమాని ఇంటికే కన్నం వేసిన డ్రైవర్.. చోరీ చేసిన బంగారంతో గోవా ట్రిప్ ఎంజాయ్..! చివరకు..

గుంటూరు జిల్లాకు చెందిన కారు డ్రైవర్ జోసఫ్ తన యజమాని ఇంట్లో 234.5 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. కొంత బంగారాన్ని స్నేహితుల సాయంతో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో గోవా వెళ్లగా, సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

యజమాని ఇంటికే కన్నం వేసిన డ్రైవర్.. చోరీ చేసిన బంగారంతో గోవా ట్రిప్ ఎంజాయ్..! చివరకు..
Driver Theft Case
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 1:17 PM

Share

అతని పేరు జోసెఫ్.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన జోసఫ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అయితే చెడు వ్యసనాలకు లోనై సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తెనాలి లక్ష్మీ సినిమా హాల్ ఎదురుగా ఉన్న మొబైల్ షాపులో చోరికి పాల్పడ్డాడు. షాపులో ఐఫోన్ తోపాటు మొబైల్ ఫోన్లు, నగదు దొంగలించాడు. అయితే సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు జోసఫ్‌ను పట్టుకోలేకపోయారు.

జోసఫ్.. కఠెవరంలోని ఎస్ఐసీ రిటైర్డ్ ఉద్యోగి సాల్మన్ రోజు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ ఇంటి అనుపానులన్నీ గమనించాడు. సాల్మన్ రాజు కుటుంబం ఇంటిలో లేని సమయం చూసుకుని జోసఫ్ ఆ ఇంటిలోకి వెళ్లాడు. ఇంటిలో ఉన్న 234.5 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన సాల్మన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు.. జోసఫే దొంగతనం చేసినట్లు తేల్చారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. మొబైల్ షాపులో చోరీ చేసింది కూడా తానేనని చెప్పాడు.

అయితే సాల్మన్ రాజు ఇంటిలో చోరీ చేసిన ఆభరణాల్లో 51 గ్రాముల ఆభరణాలను తన స్నేహితుడైన బేతపూడి సురేశ్‌కు ఇచ్చాడు. సురేశ్ తన స్నేహితులైన పవన్ తేజ, వంశీల సాయంతో వాటిని పొన్నూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణం పొందారు. ఆ రుణాన్ని పంచుకొని గోవా వెళ్లి ఎంజాయ్ చేశారు. మరొకొన్ని ఆభరణాలను తాకట్టు పెట్టడానికి సిద్దమవ్వగా పోలీసులు జోసఫ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 178 గ్రాముల బంగారు ఆభరణాలను, రెండు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us