Weather Update: వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. లేటెస్ట్ రిపోర్ట్ ఇదిగో
ఎల్‌నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎల్‌నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మబ్బులు పడుతున్నప్పటికీ.. వర్షాలు కురవడం లేదు.. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈ రోజు, అంటే 2026 జూలై 9న, ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. తద్వారా, దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే సాధారణ తేదీ జూలై 8 కాగా, ఈసారి జూలై 9 నాటికి అవి దేశమంతటా విస్తరించినట్లయింది (అంటే సాధారణ తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా).. దీంతోపాటు.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
