AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Saddam: జబర్దస్త్ సద్దాం గర్ల్ ఫ్రెండ్ ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ నటి.. బన్నీతో సినిమా కూడా

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో సద్దాం హుస్సేన్ కూడా ఒకడు. అంతకు ముందు పటాస్ షోలోనూ కంటెస్టెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడీ కర్నూలు కుర్రాడు. ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు సద్దాం.

Jabardasth Saddam: జబర్దస్త్ సద్దాం గర్ల్ ఫ్రెండ్ ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ నటి.. బన్నీతో సినిమా కూడా
Jabardasth Saddam
Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 7:39 PM

Share

సద్దాం.. బుల్లితెర ఆడియెన్స్ కు ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో ఇతను వేసే కామెడీ పంచులు ఓ రేంజ్ లో ఉంటాయి. జబర్దస్త్ కంటే ముందు పటాస్, అదిరింది వంటి టీవీ కామెడీ ప్రోగ్రామ్స్ లో గల్లీ బాయ్స్ అంటూ తెగ హంగామా చేశాడు సద్దాం హుస్సేన్. అన్నట్లు సద్దాం రాయలసీమ కుర్రాడే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో పుట్టి పెరిగాడు. అందుకే అతని కామెడీ పంచుల్లో తరచూ రాయల సీమ స్లాంగ్ కనిపిస్తుంటుంది. కేవలం రూ. 270తో హైదరాబాద్ కు వచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు తన కామెడీ తో లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే.. సద్దాం హుస్సేన్ తన వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇతను అనశ్వి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. పలు సార్లు జంటగా కనిపించిన వీరు సోషల్ మీడియాలోనూ తమ ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఇక లేటెస్ట్ గా సద్దాం హుస్సేన్ రోజును పురస్కరించుకుని అతనితో వివిధ సందర్బాల్లో దిగిన పలు త్రో బ్యాక్ ఫొటోలను షేర్ చేసింది అనశ్వి.’ నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నాకెంతో ప్రత్యేకం. గత సంవత్సరం నువ్వు చాలా ఆటు పోట్లు ఎదుర్కొన్నావు. వాటి నుంచి చాలా నేర్చుకున్నావు. చాలా కష్టపడి పని చేశాను. ఇప్పుడు అందుకు తగ్గ ప్రతి ఫలం అందుకుంటావని ఆశిస్తున్నాను’ అంటు సద్దాంపై ప్రేమను కురిపించింది అనశ్వి.

ప్రస్తుతం అనశ్వి, సద్దాం హుస్సేన్ కలిసున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అనశ్వి టాలీవుడ్ లో ప్రముఖ నటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఈ నటికి మంచి గుర్తింపు తెచ్చింది. అందులో రష్మిక పక్కన ఉండి ‘అన్నో నేను వచ్చి పెట్టేదా ముద్దు’ అని డైలాగ్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి ఈమెనే. పుష్పతో పాటు టైగర్ నాగేశ్వరరావు, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లేటెస్ట్ గా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాల్లోనూ సహాయక నటిగా మెప్పించింది. ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో కనిపించే అనశ్వి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను కూడా పంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ సద్దాంతో అనశ్వి రెడ్డి..

View this post on Instagram

A post shared by Anshh🌸 (@anashvi_reddy)

కాగా అనశ్విది తిరుపతి. పుష్ప సినిమా కోసం రష్మిక కి చిత్తూర్ స్లాంగ్ నేర్పింది కూడా అనశ్వినే. సినిమాల్లో బొద్దుగా కనిపించే అనశ్వి పాత్రల కోసమే అలా వెయిట్ పెరిగిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సద్దాం గర్ల్ ఫ్రెండ్..

View this post on Instagram

A post shared by Anshh🌸 (@anashvi_reddy)

రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో..

View this post on Instagram

A post shared by Anshh🌸 (@anashvi_reddy)

Follow Us