AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Rajamouli: చావు అంచుల దాకా వెళ్లా.. ఆ నటుడే తిండి పెట్టి మరీ ఆదుకున్నారు: జబర్దస్త్ రాజమౌళి

జబర్దస్త్ కామెడీ షో చూసే వారికి రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాగుబోతు పాత్రలు, పేరడీ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యాడీ కమెడియన్. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తోన్న ఈ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Jabardasth Rajamouli: చావు అంచుల దాకా వెళ్లా.. ఆ నటుడే తిండి పెట్టి మరీ ఆదుకున్నారు: జబర్దస్త్ రాజమౌళి
Jabardasth Comedian Rajamouli
Basha Shek
|

Updated on: Feb 26, 2026 | 9:28 PM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. తాగు బోతు పాత్రలు, పేరడీ సాంగ్స్ తో ఇతను చేసే స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను గిలిగింతలు పెట్టాయి. ఓ సాధారణ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన రాజమౌళి తన కామెడీ ట్యాలెంట్ తో తో టీమ్ లీడర్ దాకా ఎదిగే ఛాన్స్ వచ్చింది. అయితే కొందరి కారణంగా ఆ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిందని ఆ మధ్య ఒక సందర్భంలో వాపోయాడీ కమెడియన్. ప్రస్తుతం సినిమాల్లోనూ కనిపిస్తున్న రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే కరోనా టైంలో తనతో పాటు తన ఫ్యామిలీ ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నాడు.

‘కరోనా వచ్చిన టైమ్ లో.. నేను నిజంగానే చనిపోతానని భయపడ్డాను. అప్పుడు పరిస్థితి అంత దారుణంగా ఉండేది. నాతో పాటు నా కుటుంబం కూడా కోవిడ్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది. నాతో పాటు మా అమ్మ, భార్య, పిల్లలకు, అన్న వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. దీంతో నా ఫ్యామిలీ ఏమైపోతుందోనని ఎంతో బాధ పడ్డాను. అలాంటి సమయంలో అదిరే అభి అన్నతో పాటు మరికొంత మంది జబర్దస్త్ టీమ్ సభ్యులు నాకు అండగా నిలిచారు. నాతో పాటు నా కుటుంబాన్ని కాపాడారు. ఈ క్లిష్ట సమయంలో నన్ను ఆదుకున్న వారిలో మ్యూజిల్ డైరెక్టర్ భోలే (బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్) కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. కొవిడ్ టైమ్ లో నాకు షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోయాయి. దాంతో ఏది పడితే అది తినే పరిస్థితి లేదు. ఈ విషయం తెలుసుకున్న భోలే అన్న వాళ్ల అమ్మ గారు.. ఆయన భార్య ప్రత్యేకంగా నా కోసం వంట చేసి ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. కరోనా రోజులు చాలా భయానకంగా గడిచాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను’అని రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు. . ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జబర్దస్త్ రాజమౌళి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us