వెంకీ రిజెక్ట్ చేసిన కథతో బాలయ్య సినిమా.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు.. ఏ మూవీనో తెలుసా?
సినిమా కథల ఎంపికలో ఒక్కో హీరో ఒక్కో విధంగా ఆలోచిస్తాడు. తమకు సూట్ కాని కథలు, సినిమాలను ఏ మాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేస్తారు. అలా వెంకటేష్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో బాలయ్య ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇంతకీ ఆ మూవీ ఏదంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు మూల స్తంభాల్లో బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఒకరు. సీనియర్ హీరోలు అయినప్పటికీ వీరు ఇప్పటికీ వేగంగా సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. అలా ఈ ఇద్దరు హీరోల ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక వివిధ కారణాలతో వీరు కూడా చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. అందులో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. మరికొన్ని హిట్ మూవీస్ ఉన్నాయి. అలా వెంకటేష్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? నందమూరి నటసింహం నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో సమర సింహారెడ్డి ఒకటి. బి. గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ మూవీ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, డైలాగులు, పాటలు, బాలయ్య యాక్టింగ్.. ఇలా ఎన్నో అంశాలు హైలెట్ గా నిలిచాయి.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సమరసింహా రెడ్డి సినిమాలో హీరో పాత్రకు బాలకృష్ణ మొదటి ఎంపిక కాదట. ఈ కథను మొదట విక్టరీ వెంకటేష్‌కు వినిపించారట దర్శకుడు బీ. గోపాల్. వెంకటేష్ కు కూడా కథ బాగా నచ్చిందట. అయితే ఇందులో ఫ్యాక్షన్ మరీ ఎక్కువగా ఉండడంతో వెంకటేష్ వెనక్కడుగు వేశాడట. ఈ సినిమా స్టోరీ తనకు కథ పూర్తిగా సూట్ అవ్వదని.. ఈ క్యారెక్టర్ కు బాలయ్యే సరైన ఎంపిక అని వెంకీ స్వయంగా దర్శకుడికి చెప్పారట. దీంతో దర్శకుడు నేరుగా బాలకృష్ణ కు చెప్పగా ఆ యన వెంటనే ఒకే చెప్పారట. ఇక ఆ తర్వాత సమర సింహారెడ్డి సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ ఫ్యాక్షనిస్ట్ రోల్‌లో నటించగా, అంజలా జవేరి, సంఘవి, సిమ్రాన్ హీరోయిన్లుగా కనిపించారు. 1999 లో సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన సమరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలకు పునాది వేసింది సమరసింహా రెడ్డి అనే చెప్పుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




