AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Movie: నితిన్ ‘దిల్’ సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వివి వినాయక్ తెరకెక్కించిన సినిమా దిల్. అప్పటికే జయం సినిమా సక్సెస్ తో మంచి ఊపులో ఉన్న నితిన్ ఇందులో హీరోయిన్ గా నటించాడు. కాగా ఇదే సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నేహా.

Dil Movie: నితిన్ 'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Dil Movie
Basha Shek
|

Updated on: Feb 27, 2026 | 6:08 PM

Share

జయం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత హీరో నితిన్ నటించిన సినిమా దిల్. 2003లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా తర్వాతనే నిర్మాత రాజు కాస్తా దిల్ రాజు గా మారిపోయాడు. కాగా ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో నితిన కు జోడీగా నేహా బాంబ్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా సక్సెస్ కావడంతో ఈ అమ్మడికి కూడా అవకాశాలు బాగానే వచ్చాయి. కాగా తెలుగు సినిమాల్లోకి రాక ముందు నేహా బాంబ్‌ హిందీలో ‘ఇష్క్ హోగయా మేను’ సినిమాలో నటించింది. ఆ తర్వాత దిల్ సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో దోస్త్, అతడే ఒక సైన్యం తదితర సినిమాల్లోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే దీని తర్వాత ఈ బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు కరువయ్యాయి. దీంతో బొమ్మరిల్లు, దుబాయ్ శీను తదితర సినిమాల్లో సహాయక నటిగా చేసింది.

తెలుగులో అవకాశాలు తగ్గిన తర్వాత మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది నేహా. కొన్ని సినిమాలు కూడా చేసింది. అయితే క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది. కొన్ని సీరియల్స్ తో పాటు టీవీ షోస్ లోనూ యాంకర్ గా మెరిసింది. అయితే 2009లో ‘నాగిన్‌ వాడన్‌ కీ అగ్నీ పరీక్ష’ సీరియల్‌ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

నేహా లేటెస్ట్ ఫొటోస్..

సినిమా అవకాశాలు తగ్గాక రిషిరాజ్ ఝావేరి అనే బిజినెస్ మెన్ ను పెళ్లాడింది నేహా.పెళ్లి తరువాత కూడా నేహా ఏ మూవీ, సీరియల్స్ లోనూ కనిపించలేదు. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. వారి ఆలనాపాలనతో పరిమితమయ్యిందీ అందాల తార. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది నేహా. తన పర్సనల్, ఫ్యామిలీ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది నేహా. కానీ అందం ఏ మాత్రం తగ్గ లేదని ఈమె ఫొటోలను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

భర్త, పిల్లలతో నేహా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర