AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ కల నెరవేరింది.. తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది.. ఆమె కొడుకు చేసిన పనితో

హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కొడుకు తన తల్లి జీవితంలో తొలిసారి విమాన ప్రయాణం చేసేందుకు తీసుకువెళ్లాడు. ఆమె తన కలలో ఊహించని విధంగా విమానం ఎక్కుతున్న వేళ.. ఆ ఆత్మీయ క్షణాలను అతడు కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియా యూజర్ మానిష్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

అమ్మ కల నెరవేరింది.. తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది.. ఆమె కొడుకు చేసిన పనితో
First Flight Experience
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2026 | 3:56 PM

Share

వైరల్‌ వీడియోలో ఒక కొడుకు తన తల్లిని మొదటిసారి విమానంలో ఎక్కించాడు. విండో సీటులోంచి బయటి దృశ్యాన్ని చూస్తూ.. ఆమె తన జీవితాన్ని వెనక్కి తిరిగి ఆలోచించటం మొదలుపెట్టింది. జీవితంలో తను చేసిన పోరాటాలను గుర్తుచేసుకుంటూ ఆమె కళ్ళు చెమర్చాయి. జీవితాంతం ఇంటికే పరిమితమై అందరికీ సేవలు చేస్తుంది తల్లి.. వృద్దాప్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం మన వంతు అంటున్నారు ఆ కుమారుడు. తమిళనాడులో నివసించే మనీష్ తన తల్లి కలలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి, అతను చేసిన మొదటి పని ఆమెను విమానం ఎక్కించి తీసుకెళ్లడం. ఆమె మొదటిసారి విమానంలో ఎక్కినప్పుడు.. భావోద్వేగానికి గురైంది. ఆ వీడియో మరపురాని క్షణాన్ని తెలియజేస్తుంది. ఇన్‌స్ట వేధికగా వీడియో వైరల్‌గా మారింది.

ఇంతకీ వీడియోలో ఏముందంటే…ఒక తల్లి, కొడుకు ఇద్దరూ కలిసి విమానాశ్రయానికి చేరుకుంటారు. తల్లి తన కొడుకు తోడుతో ముందుగా సెక్యూరిటీ చెకప్‌ను పూర్తి చేస్తుంది. ఆ తరువాత విమానానికి ఎక్కుతారు. ఆమె ముఖంలో ఆనందం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణం ఆమెకు మాత్రమే కాదు.. తన కుటుంబంలోని వారు మొత్తంమీద.. విమానంలో ప్రయాణించిన మొదటి మహిళ కావడంతో ఈ ఘటన తీవ్రమైన భావోద్వేగ క్షణంగా మారింది.

ఇవి కూడా చదవండి

విమానంలోకి ఎక్కిన తర్వాత తల్లి వాతావరణాన్ని గమనిస్తూ సక్సఫుల్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కొడుకు ఆ అందమైన క్షణాన్ని వీడియోగా సారించుకుంటూ ఆమె ముఖంలో ఆనందం, విరబూసిన చిరునవ్వును అతడు తన కమెరాలో బంధించేసుకున్నాడు. అంతలోనే ఫ్లైట్‌లో సర్వ్‌చేసిన ఫుడ్‌ తీసుకుంటుంది.. అది తింటున్నప్పుడు అమ్మ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఇది చాలా హృదయానికి హత్తుకునే దృశ్యం.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిమతాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ఇది ప్రియమైన తల్లి కోసం ఇచ్చిన గొప్ప బహుమతి అని రాసారు. మరొకరు కామెంట్స్‌లో మన జీవితంలో ఇలాంటి చిన్న ఆనందాలే నిజమైన విజయాలు అని పేర్కొన్నారు. ఇది సాధారణ దృశ్యం అయినప్పటికీ చాలా మంది ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించింది.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by MK (@manishh_mk_)

ఈ వీడియో కేవలం ఒక ప్రయాణాన్ని మాత్రమే చూపడం కాదు, తల్లి-కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. చాలా మంది ప్రేక్షకులు తమ తల్లిదండ్రులతో కలిసి చేసిన ప్రయాణ అనుభవాన్ని పంచుకోవాలని కూడా ఈ వీడియో చూసి ప్రేరణ పొందినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా ఒక సాదా భావం ఉన్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ద్వారా మనుషుల మధ్య ప్రేమ, భావోద్వేగాలను ఎంతో మందికి చేరువ చేస్తోంది. ఎంతో మంది ఆ వీడియోను చూసి తమ తల్లిదండ్రులకు సమయాన్ని కేటాయించుకోవాలని ప్రేరణగా భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us