AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం వ్యక్తి వ్యవహారతీరు, భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని నమ్మకం. కష్టపడి పనిచేసే స్వభావం, ధైర్యం, తెలివితేటలు, అలాగే గ్రహాల అనుకూల దృష్టి కలిసివస్తే కొందరు పురుషులు 40 ఏళ్లలోపే అపారమైన సంపదను, ఖ్యాతిని సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాంటి అదృష్టవంతులైన నాలుగు నక్షత్రాల పురుషుల ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lucky Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
Lucky Birth Stars
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 3:36 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, ఆలోచనా తీరుతో పాటు వారి భవిష్యత్తును నిర్ణయించడంలో వారి జన్మ నక్షత్రం కీలక పాత్ర పోషిస్తుంది. కష్టపడి పనిచేసే గుణంతో పాటు గ్రహాల అనుకూలత తోడైతే, కొందరు వ్యక్తులు చాలా చిన్న వయస్సులోనే (అంటే 40 ఏళ్లలోపు) అపారమైన సంపదను, విజయాన్ని అందుకుంటారు. అటువంటి అదృష్టవంతులైన 4 నక్షత్రాల పురుషుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

  1. అశ్విని నక్షత్రం (Ashwini): చురుకుతనం, వేగమే వీరి బలం. అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు ఎప్పుడూ చురుకుగా ఉంటారు. వీరిలో నిర్ణయాలు తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. సహజంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కెరీర్ ప్రారంభంలోనే వీరు ఉన్నత బాధ్యతలను చేపడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త దారులను వెతకడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వ్యాపార విపణిలో వచ్చే చిక్కులను వీరు చాలా తెలివిగా ఎదుర్కుంటారు.
  2. మృగశిర నక్షత్రం (Mrigashira): ఈ జన్మ నక్షత్రంలో పుట్టినవారు పట్టుదలకు మారుపేరు. ఈ నక్షత్ర జాతకులు అత్యంత మేధావులుగానూ..బలమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అందరికంటే ముందుంటారు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. తమకు వచ్చే అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూసి, సరైన సమయంలో వాటిని అందిపుచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రిస్క్ తీసుకోవడానికి వీరు అస్సలు వెనుకాడరు. అసాధ్యమనిపించే పనులను కూడా లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చడంలో వీరు నైపుణ్యులై ఉంటారు. ముఖ్యంగా ఐటీ, వ్యాపార రంగాల్లో వీరు త్వరగా రాణిస్తారు.
  3. పునర్వసు నక్షత్రం (Punarvasu): గురు గ్రహం (Jupiter) అనుగ్రహం కలిగిన పునర్వసు నక్షత్ర జాతకులు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ క్రమశిక్షణతోనే జీవితంలో విజయాలు అందుకుంటారు. వీరు ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. అదృష్టం కూడా వీరికి తోడవ్వడంతో తక్కువ సమయంలోనే పెద్ద విజయాలు సాధిస్తారు. డబ్బు సంపాదించడంలోనే కాదు, దాన్ని ఎలా పొదుపు చేయాలో కూడా వీరికి బాగా తెలుసు. వీరి సహనం, ప్రణాళికాబద్ధమైన విధానం వీరిని చిన్న వయస్సులోనే ధనవంతులుగా మారుస్తుంది.
  4. స్వాతి నక్షత్రం (Swati): స్వాతి నక్షత్రంలో పుట్టిన పురుషులు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. దీంతో పాటు జీవితంలో ఏం సాధించాలో స్పష్టమైన లక్ష్యాలు, అవగాహనతో ఉంటారు. ఏ పని చేస్తే విజయం దక్కుతుందో వీరు ముందే పసిగట్టగలరు. అనవసరమైన విషయాల్లో సమయం వృథా చేయకుండా, తమ శక్తిని సరైన మార్గంలో కేటాయిస్తారు. వీరి నిర్ణయాత్మక శక్తి, స్థిరత్వం కారణంగా ఆశించిన విలాసవంతమైన జీవితాన్ని చాలా త్వరగా సొంతం చేసుకుంటారు.

(Disclaimer: పై లక్షణాలు జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఒక వ్యక్తి విజయం సాధించడంలో జాతకంతో పాటు వారి నిరంతర కృషి, అంకితభావం కూడా అంతే ముఖ్యం. ఈ సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి కోసం అందించబడింది. దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన జ్యోతిష్యులను నేరుగా సంప్రదించగలరు)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

Follow Us