AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే

Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే

Phani CH
|

Updated on: Feb 28, 2026 | 1:39 PM

Share

శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' రొమాంటిక్ కామెడీ రివ్యూ ఇది. జాతకాల పిచ్చి ఉన్న లెక్చరర్ విష్ణు పాత్రలో శ్రీ విష్ణు కామెడీ ఆకట్టుకుంటుంది. నయన సారికతో అతని కెమిస్ట్రీ, సత్య కామెడీ సినిమాకు బలం. తొలి సగభాగం సరదాగా సాగినా, రెండో సగభాగం బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో తేలిపోయింది. ఇది ఓ పర్లేదనిపించే వినోదభరిత చిత్రం.

ఒకప్పుడు సీరియస్ సినిమాలు చేసిన శ్రీ విష్ణు.. రెండు మూడేళ్లుగా ట్రాక్ మార్చేసాడు. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ వైపు వచ్చాక శ్రీ విష్ణుకు తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలోనే యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో చేసిన మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’. ‘ఆయ్’, ‘క’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నయన సారిక ఇందులో హీరోయిన్. మరి సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా.. ఇక విష్ణు విన్యాసం కథలోకి వెళితే.. విష్ణు అలియాస్ శ్రీవిష్ణు ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్. జాతకాలు అంటే పిచ్చి.. మూడ నమ్మకాల్లోనే బతికేస్తుంటాడు. అదే కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుంటుంది మనీషా అలియాస్ నయన సారిక. పదేళ్లుగా ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మనీషాకు పెళ్లి కాదు.. వచ్చిన వాళ్లంతా పారిపోతుంటారు. అలాంటిది పరిచయమైన మొదటి రోజే విష్ణుకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది మనీషా. ఆమె విభిన్నమైన వ్యక్తిత్వం విష్ణుని ఆకర్షిస్తుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా సాఫీగా సాగి పెళ్లి పీటల దాకా వెళ్లే సమయంలో.. మనీషా చెప్పిన ఓ విషయంతో ఒక్కసారిగా జాతకం తలకిందులైపోతుంది. అసలు మనీషా ఏం చెప్పింది..? ఆమె ఆ విషయం చెప్పాక విష్ణు ఏం చేసాడు..? ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.. శ్రీ విష్ణు సినిమా అంటే కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు.. ఉన్నందాంట్లోనే కామెడీ ఉంటే చాలు అనుకోవాలి. ప్రతీసారి అదే చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఇదే మ్యాజిక్ చేయాలని వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో శ్రీవిష్ణు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. కొన్ని చోట్ల ఫన్ బాగా వర్కౌట్ అయింది. కానీ ఎఫర్ట్ లెస్‌గా చేయాలనే ప్రయత్నంలో కొన్ని సీన్స్‌లో కొంచెం ఓవర్‌గా, రొటీన్‌గానూ అనిపించాడు. హీరోయిన్ నయన సారికకు మంచి పాత్ర దక్కింది. తన క్యారెక్టర్‌లో కాన్ఫిడెంట్‌గా, చాలా అందంగా కనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్టుగా వెళ్లిపోయింది. కథ ఏం లేకపోయినా కూడా చిన్న చిన్న మూవెంట్స్‌తో అల్లుకున్నాడు దర్శకుడు మారుతిరావు. కామెడీ ఎపిసోడ్స్ బాగా పేలాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు, సత్య కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్. కాకపోతే సెకండ్ హాఫ్ తేలిపోయింది. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సెకండాఫ్ అంత బలంగా సాగలేదు. బలమైన ఎమోషన్స్ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు.. హీరోయిన్ పాత్రను కాస్త డిఫరెంట్‌గా రాసుకుని, శ్రీవిష్ణు – సత్యల కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆడియన్స్‌ను ఎలాగైనా నవ్వించాలన్న దర్శకుడి తాపత్రయం ఫస్ట్ హాఫ్‌లో కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ ఐదారుగురు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా, కేవలం హీరో చుట్టూనే కామెడీని తిప్పడం మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి బోర్ లేకుండా డీసెంట్ కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే సినిమా రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే 30 నిమిషాల డ్రామా ఏమాత్రం ఆసక్తికరంగా లేదు, సరైన ఎమోషనల్ డెప్త్ లోపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే ఊహించేలా ఉండటంతో పాటు, దాన్ని చాలా సింపుల్‌గా హడావిడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. శ్రీ విష్ణు సినిమాకు బలం.. సింపుల్ కథను కూడా మోసాడు ఈ హీరో. చాలా చోట్ల ఈయన డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. ఏం లేని చోట కూడా దూరిపోయి కామెడీ చేసాడు. అది ఆయన ప్లస్.. సినిమాకు కూడా అదే ప్లస్ అయింది. నయన్ సారిక స్క్రీన్ మీద చాలా బాగుంది. సత్య మరోసారి అదిరిపోయే కామెడీ చేసాడు. ఉన్నంతలో నవ్వించాడు. మిగిలిన వాళ్లలో బ్రహ్మాజీ, ప్రవీణ్ జస్ట్ ఓకే.. మురళీ శర్మ చిన్న పాత్రలో మెరిసాడు.. శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, గోపరాజు రమణ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. అయితే రధన్ సంగీతం కాస్త తేలిపోయింది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రొటీన్‌గానే ఉంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ప్లస్. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా డీసెంట్‌గా ఉన్నాయి. దర్శకుడు యధునాధ్ మారుతి రావు పూర్తిగా బాల్ తీసుకెళ్లి శ్రీ విష్ణు చేతిలో పెట్టేసాడు.. సెకండాఫ్ బాగా రాసుకుని ఉండుంటే సినిమా రేంజ్ పెరిగేది. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే.. విష్ణు విన్యాసం.. పర్లేదనిపించే కామెడీ విన్యాసం..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..! మామూలుగా లేదుగా..

Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్

Follow Us