AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: అంబానీ స్కూల్‌లో ఐశ్వర్యరాయ్ కూతురు.. ఆరాధ్య బచ్చన్ లంచ్ బాక్స్‌లో ఏమేం ఉంటాయో తెలుసా?

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుంది. ఆమె స్కూలింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు, ఆరాధ్య గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.

Aishwarya Rai: అంబానీ స్కూల్‌లో ఐశ్వర్యరాయ్ కూతురు.. ఆరాధ్య బచ్చన్ లంచ్ బాక్స్‌లో ఏమేం ఉంటాయో తెలుసా?
Aishwarya Rai
Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 2:02 PM

Share

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సినిమాలేవీ చేయడం లేదు. అయితే తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుందీ అందాల తార. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అప్పట్లో అత్యంత చర్చనీయాంశమైంది. ఇక కొన్ని రోజుల క్రితం వరకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి పుకార్లు తెగ షికార్లు చేశాయి. అయితే, ఈ విడాకుల వార్తలో నిజం లేదని అభిషేక్ బచ్చన్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కుమార్తె తరచూ వార్తల్లో నిలుస్తోంది. సందర్భమేదైనా తన తల్లి చేయి పట్టకుని కనిపించే ఈ స్టార్ కిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరాధ్య బచ్చన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఆరాధ్య బచ్చన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతుంది. ఆరాధ్య మాత్రమే కాదు, చాలా మంది సెలబ్రిటీల పిల్లలు ఈ స్కూల్‌లో చదువుతారు. ధీరూబాయ్ అంబానీ స్కూల్ కు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ముంబైలోనే కాకుండా దేశంలో కూడా చాలా విలాసవంతమైన పాఠశాల ఇది. ఇక్కడ పిల్లల కోసం ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మనవడు కూడా ఈ స్కూల్‌లో చదువుకుంటున్నారు.

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె మొదటి నుంచి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే చదువుతోంది. ఈ స్కూల్ లో పిల్లల ఆరోగ్యంతో పాటు, వారి ఆహారం, డ్రింక్స్ విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటారు. ఇక్కడ పిల్లలకు వడ్డించే ఆహారంలో శుచి, శుభ్రతకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. కేవలం ఆరాధ్యకు మాత్రమే కాదు పాఠశాలకు వచ్చే ప్రతి స్టూడెంట్ కు తాజా, శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తారు. పిల్లలకు అల్పాహారం నుంచి భోజనం వరకు ప్రతిదీ పాఠశాలలోనే లభిస్తుంది. ఇక స్కూల్ ఫుడ్ మెనూను సంజీవ్ కపూర్ రూపొందిస్తారు. పిల్లలకు అత్యంత పోషకమైన ఆహారం అందించే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ కు అస్సలు అలవాటుపడకుండా జాగ్రత్త లు తీసుకుంటారు.

పిల్లల ఫుడ్ మెనూ విషయానికి వస్తే.. ఆహారంలో తాజా పండ్లు ఎక్కువగా ఇస్తారు. పిల్లలు తమ రోజును బాగా ప్రారంభించడానికి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తారు. భోజనంలో భాగంగా పనీర్ కూరగాయలు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్, మల్టీ-ఫ్లోర్ చపాతీలు పిల్లలకు వడ్డిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us