Cinema : తెలుగులో బ్లాక్ బస్టర్.. ఏకంగా 9 భాషలలో రీమేక్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న సినిమా..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలకు అసలు ఎక్స్పైరీ అంటూ ఉండదు. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చిత్రాలకు ఉండే ఫ్యాన్ బేస్ తగ్గదు. ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం విడుదలై సంవత్సరాలు గడిచినప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే.

కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఓ చిన్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. తెలుగులో రూపొందించిన ఈ సినిమాను ఏకంగా 9 భాషలలో రీమేక్ చేయగా.. అన్ని భాషలలోనూ సంచలన విజయం సాధించింది. అదే నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని సాంగ్స్ సైతం ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ఎలాంటి హడావిడి, యాక్షన్ సీన్స్ లేకుండా అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ అడియన్స్ గుండెలలో నిలిచిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..
కథ విషయానికి వస్తే.. తన స్నేహితురాలికి పెళ్లికి వెళ్లిన ఓ అమ్మాయి.. అక్కడే ఉన్న ఎన్నారై అబ్బాయి ప్రేమలో పడతారు. కానీ అతడి ప్రేమకు తన తల్లి ఒప్పుకోకపోవడంతో అమ్మాయి కోసం పల్లెటూరికి వెళ్లిపోతాడు. అక్కడే సిరి అన్నయ్య శ్రీహరి సంతోష్ కు వ్యవసాయం చేయాలని సవాలు విసురుతాడు. అయితే అతను గ్రామానికి వచ్చి, పొలంలో పనిచేసి, తనను తాను ఒప్పించుకుంటేనే నిజమైన ఉన్నత శిఖరాలను చేరుకోగలడని చెబుతాడు. అతడు నిజానికి గెలిచాడా లేదా.. అనేది సినిమా కథ.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?
సినిమాకు ముందు వచ్చిన పాటలు, ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన “నువ్వొస్తానందే” అనే టైటిల్ ట్రాక్, తెలుగు ప్రేమకు పర్యాయపదంగా మారాయి. ఈ చిత్రం 90 కాపీలతో విడుదలైంది; ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా అదనపు కాపీలను జోడించారు. ఇది 79 కేంద్రాలలో 50 రోజులు, 35 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడి, 2005లో తెలుగు చిత్రసీమలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని తర్వాత 9 భాషల్లో రీమేక్ చేయగా, ప్రతి భాషలోనూ అది విజయం సాధించింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..
ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
