మొదటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మంగుళూరు భామ ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతోపాటు కృతికి తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో మరో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.
ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. అలాగే మలయాళంలోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. ఇక కార్తీతో జత కట్టిన వా వాతియార్ సినిమా విడదులై నిరాశ పరిచింది.
ఇక ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ఎల్ఐకే మూవీ మాత్రం ఇంకా విడుదల కాలేదు. నిజానికి ఈ మూవీ గతేడాది అక్టోబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
ఆ తర్వాత పలుమార్లు ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే విషయం నెట్టింట వైరలవుతుంది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండవ వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో సందడి చేస్తుంది కృతి.