AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanu Priya : మా అక్క మానసికంగా కుంగిపోయింది.. ఆమెను ఎవరూ పట్టించుకోవట్లేదు.. భానుప్రియ చెల్లెలు..

అందమైన కళ్లు.. అద్భుతమైన నటన, నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న హీరోయిన్ భానుప్రియ. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తాజాగా ఆమె చెల్లెలు శాంతిప్రియ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Bhanu Priya : మా అక్క మానసికంగా కుంగిపోయింది.. ఆమెను ఎవరూ పట్టించుకోవట్లేదు.. భానుప్రియ చెల్లెలు..
Bhanupriya, Shanti Priya
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2026 | 2:04 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వైరలవుతున్న రూమర్స్ పై ఆమె సోదరి శాంతిప్రియ స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శాంతిప్రియ మాట్లాడుతూ భానుప్రియ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొన్ని సినిమాల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని శాంతిప్రియ అన్నారు. “ఆమె కొంతకాలంగా చాలా బాధలో ఉన్నారు. కొన్ని సినిమాలు చేయమని ఆమెను సంప్రదించినప్పటికీ, చిత్రీకరణ సమయంలో పాత్రలలో చేసిన మార్పులు ఆమెను కలవరపరిచాయి. సెట్‌కు వచ్చినప్పుడు మొదట అంగీకరించిన కథ అది కాదు. దాదాపు 280 సినిమాలు పూర్తి చేసి, ఎన్నో అవార్డులు గెలుచుకున్న వారిని అలా చూపించడం మర్యాదపూర్వకం కాదు. వారిని ఆ పరిస్థితిలో చూడటం నాకు ఇష్టం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

తన భర్త చనిపోయిన తర్వాత, మా అక్క కొంతకాలం కుంగిపోయింది. మా అక్క అలాంటి చోట్లకు వెళ్ళదు. కానీ 80ల నాటి రియూనియన్‌కి ఆమెను ఇంకా ఎవరూ ఆహ్వానించలేదు. ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడొద్దని మా అక్క నాతో చెబుతుంది, కానీ నేను ఆమెకు నిస్సంకోచంగా చెప్పేస్తాను. అక్క నంబర్ తెలియకపోయినా లేదా సంప్రదింపు సమాచారం లేకపోయినా, మీరు నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్ చేయవచ్చు. ఇండస్ట్రీలో అందరికీ మా అన్నయ్య తెలుసు. మా అక్క ఇకపై సినిమాలు చేయదు. కానీ నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా అక్క మానసిక స్థితిలో ఎలాంటి లోపం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేసేవారికి నాదొక విన్నపం, దయచేసి మా అక్క గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. యూట్యూబ్‌లో ఎవరో ఏమీ తెలియకుండా నా సోదరి గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. కావాలంటే చర్య తీసుకోవచ్చు. కానీ దాని అవసరం లేదు. నా సోదరికి మరో ఇల్లు ఉంది ఆమె కూతురు లండన్‌లో చదువుకుంటోంది. ఆమె అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటుంది. మిగతా సమయాల్లో ఆమె మాతోనే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శాంతిప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us