కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నేహా శెట్టి. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార.
మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మెప్పించింది నేహా.
కానీ 2022లో సిద్ధు జొన్నలగడ్డ సరసన ఆమె నటించిన డీజే టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో తెలుగు సినీ ప్రపంచంలో ఆమె పేరు మారుమోగింది.
ముఖ్యంగా ఈ మూవీలో గ్లామరస్ లుక్స్ లో కుర్రకారుకు మెంటలెక్కించింది ఈ వయ్యారి. రాధిక పాత్రతో అందం, గ్లామరస్ లుక్స్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో సైలెంట్ అయ్యింది.
డీజే టిల్లు తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే గ్లామరస్ టచ్ ఇచ్చింది ఈ వయ్యారి.
దీంతో నేహా శెట్టి ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఈ అందాల తారకు ఆఫర్స్ ఎందుకు రావడం లేదంటూ నెట్టింట కామెంట్స్ మోత మోగిస్తున్నారు.