చీరకట్టులో మతిపోగొట్టేస్తున్న శ్రుతి హాసన్.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్

Rajitha Chanti

Pic credit - Instagram

04 April 2026

చాలా కాలంగా శృతి హాసన్ కేవలం డార్క్ షేడ్స్‌లోనే కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే, తాజా ఫోటోషూట్‌లో మతిపోగొట్టేస్తుంది.

ఆమె ఎంచుకున్న పింక్ కలర్ శారీ ఆమెలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. గ్లామర్‌కు క్లాసిక్ టచ్‌ను జోడిస్తూ, ఆమె కట్టిన ఈ చీర అభిమానులను కట్టిపడేస్తోంది.

ఈ పింక్ శారీలో శృతి ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తున్నారు. చీరపై ఉన్న డిజైన్, దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి.

నలుపు రంగులో ఉండే గాంభీర్యం కంటే, ఈ పింక్ లుక్‌లో ఆమె ఎంతో ఆహ్లాదంగా, ప్రకాశవంతంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సాంప్రదాయక కట్టులోనూ తనదైన మోడ్రన్ టచ్ ఇచ్చేలా శృతి ఈ లుక్‌ను డిజైన్ చేసుకున్నారు. మినిమలిస్ట్ మేకప్,  సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఆమె లుక్ చాలా సహజంగా ఉంది.

2021లో క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా స్టేటస్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది ఈ వయ్యారి.

ఇప్పుడు చీరకట్టులో అందాల గ్లామర్ పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. పింక్ కలర్ చీరలో మరింత అందంగా, సహజంగా కనిపిస్తుంది ఈ వయ్యారి.