AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లికి ఒప్పుకోలేదని ఓయోకు వెళ్లిన యువకుడు.. తెల్లారేసరికల్లా..!

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలితో కలిసి హోటల్ రూమ్‌కు వచ్చి యువకుడు విగతజీవిగా మారాడు. ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించటంతో, ఆ యువకుడు ఓయో రూంలో పెళ్ళి బట్టలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad: పెళ్లికి ఒప్పుకోలేదని ఓయోకు వెళ్లిన యువకుడు.. తెల్లారేసరికల్లా..!
Young Man Commits Suicide
Balaraju Goud
|

Updated on: Apr 04, 2026 | 1:51 PM

Share

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలితో కలిసి హోటల్ రూమ్‌కు వచ్చి యువకుడు విగతజీవిగా మారాడు. ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించటంతో, ఆ యువకుడు ఓయో రూంలో పెళ్ళి బట్టలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపూర్ చెర్లోపల్లి గ్రామానికి చెందిన వనమాల లోకేష్(29) చింతల్ గణేష్ నగర్ లో నివాసం ఉన్నాడు. అతడు గండిమైసమ్మలోని హెటిరో ఫార్మా కంపెనీలో పని చేస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఆ ఇద్దరు వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. లోకేష్ కుటుంబ సభ్యులు సమ్మతించటంతో వివాహం ఏర్పాట్లలో మునిగిపోయారు. లోకేష్ కు వివాహం ఖర్చుల కోసం అతని కుటుంబసభ్యులు డబ్బులు సైతం పంపించారు. ఆ డబ్బులతో ఆ ఇద్దరు పెళ్లికి కావలసిన బట్టలు, పుస్తెలు తీసుకున్నారు.

పెళ్లి ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 03) ఆ జంట కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని ఫ్లాగ్ షిప్ సౌత్ పాయింట్ రెసిడెన్సీ ఓయో రూంలో గది అద్దెకు తీసుకున్నారు . మధ్యాహ్నం సమయంలో యువతిని భోజనం తీసుకుని రమ్మని కిందకు పంపించిన లోకేష్, పెళ్ళిబట్టలు ధరించి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువతి తిరిగి వచ్చి, గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోకపోవటంతో ఓయో రూమ్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారి సహాయంతో తలుపులు తెరిచి చూడగా లోకేష్ ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించిగా లోకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?