AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన అనిత అనే గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన ఆమెకు బుధవారం ఉదయం డెలివరీ చేయాల్సి ఉండగా.. మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
Pregnant Woman Death
P Shivteja
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 7:28 PM

Share

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి బంధువుల ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.. బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణి.. ఈ నెల 10వ తేదీన కాన్పు కోసం సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఈరోజు ఉదయం ఆమెకు డెలివరీ చేయాల్సి ఉండగా.. అనిత మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వారు బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. పెద్ద ఎత్తున ఆస్పత్రి దగ్గరకు చేరుకుని.. వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడం, వారి నిర్లక్ష్యం కారణంగానే అనిత ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు.

బాధితుల ఆందోళనతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా