AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Free Coaching: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..

డాక్టర్‌ కావాలనే కలను సాకారం చేసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) శుభవార్త చెప్పింది. NEET–2027 కోసం ఉచిత లాంగ్‌టర్మ్‌ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌లోని చిలుకూరు TGSWR ఫౌండేషన్ COEలో బాలురకు, మహేంద్రహిల్స్‌ ఫౌండేషన్ COEలో బాలికలకు కలిపి మొత్తం 200 సీట్లను కేటాయించారు.

NEET Free Coaching: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
Neet Free Coaching
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 6:26 PM

Share

వైద్య విద్యనభ్యసించి డాక్టర్ కావాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. NEET–2027 లాంగ్‌టర్మ్‌ ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సెక్రెటరీ కంభంపాటి శారద తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్‌లోని చిలుకూరు TGSWR ఫౌండేషన్ COEలో బాలురకు, మహేంద్రహిల్స్‌ ఫౌండేషన్ COEలో బాలికలకు ఈ ఉచిత శిక్షణను అందించనున్నారు. మొత్తం 200 సీట్లలో బాలురకు 100, బాలికలకు 100 సీట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని ముఖ్యమైన అర్హతలను నిర్దేశించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ BiPC పూర్తి చేసి, నీట్-2026 పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. SC, ST, OBC, EWS సహా వివిధ అర్హత కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు TGSWREIS అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన పత్రాలను నిర్దేశిత గడువులోగా తమ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కు అందజేయాల్సి ఉంటుంది.

కాగా, ఈ ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకపోవడం విశేషం. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 22 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఉచిత వసతి, నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించే ఈ సువర్ణావకాశాన్ని అర్హులైన అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకుని, తమ మెడికల్ సీటు కలాన్ని సాకారం చేసుకోవాలని TGSWREIS సెక్రెటరీ కంభంపాటి శారద కోరారు. DCOల చిరునామాలు, ఇతర పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వివరాల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us