AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanraj: ఆ కారణంతోనే ఫోన్లకు దూరంగా సుడిగాలి సుధీర్.. అసలు విషయాన్ని చెప్పేసిన ధనరాజ్

జబర్దస్త్ తనకు తల్లి లాంటిదని, ఫేమ్, డబ్బు ఇచ్చిందని ధనరాజ్ వెల్లడించారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ వంటివారు తమ నిష్క్రమణతో టీమ్ లీడర్లుగా మారారని, వారి విజయం వారికి రాసిపెట్టి ఉందని ధనరాజ్ పేర్కొన్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Dhanraj: ఆ కారణంతోనే ఫోన్లకు దూరంగా సుడిగాలి సుధీర్.. అసలు విషయాన్ని చెప్పేసిన ధనరాజ్
Dhanraj
Ravi Kiran
|

Updated on: Apr 04, 2026 | 1:56 PM

Share

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ తన కెరీర్, సహచర కమెడియన్లు, జబర్దస్త్ షోతో తనకున్న అనుబంధం గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. జబర్దస్త్ తనకు తల్లి లాంటిదని, అది తనకు ఫేమ్, డబ్బుతో పాటు ఒక ప్రొడ్యూసర్‌గా ఎదగడానికి అవసరమైన ఆర్ధిక మూలాలను కూడా ఇచ్చిందని ధనరాజ్ అన్నారు. జబర్దస్త్ ద్వారానే ధనాధన్ ధనరాజ్ అనే పేరు చిన్న పిల్లలకు కూడా తెలిసిందని పేర్కొన్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వారిలో దాదాపు 90 శాతం మంది విజయం సాధించారని ధనరాజ్ చెప్పారు. సత్య, నవీన్ నేని, రాకేష్, వేణు వంటివారు విజయవంతమయ్యారని తెలిపారు. సత్య ప్రస్తుతం అత్యంత హ్యాపెనింగ్ కమెడియన్లలో ఒకరని తెలిపారు. రాకెట్ రాఘవ వంటివారు జబర్దస్త్‌లో వందల కొద్దీ స్కిట్లు చేసి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు.

తమ తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వంటివారు కూడా అద్భుతంగా రాణిస్తున్నారని.. ఇప్పుడు సుదీర్, శ్రీను మంచిగా సెటిల్ అయ్యారని ధనరాజ్ అన్నారు. తాను, వేణు వేరొక షోలో యాంకర్లుగా చేయడానికి జబర్దస్త్ నుంచి బయటకు వచినప్పుడు, ఆ స్థానంలో సుధీర్, శ్రీను, రాంప్రసాద్ వంటి వారికి టీమ్ లీడర్లుగా అవకాశం వచ్చిందని ధనరాజ్ గుర్తు చేసుకున్నారు. ఇది తమ వల్ల కాదని, వారి విజయం వారికి రాసిపెట్టి ఉందని.. అందుకే ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్నారన్నారు.

సుడిగాలి సుధీర్ ఫోన్‌లు ఎత్తరనే ప్రచారాన్ని ఖండించిన ధనరాజ్.. సుధీర్ తన సన్నిహితులకు, స్నేహితులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని, కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు సుధీర్ స్పందించకపోవచ్చని పేర్కొన్నారు. కమెడియన్లు కూడా మంచి, ఎమోషనల్ సినిమాలు తీయగలరని వేణు నిరూపించాడని, ఇది తమందరికీ ఒక మార్గాన్ని సుగమం చేసిందని ధనరాజ్ అన్నారు. జబర్దస్త్ మానేయడానికి కారణం బిజీ షెడ్యూల్స్, షూటింగ్‌లకు డేట్లు కేటాయించలేకపోవడమే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు. మల్లెమాల ప్రొడక్షన్స్, శ్రీదేవి డ్రామా కంపెనీలతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, నాగబాబు, రోజా, అనసూయ, లక్ష్మి వంటి వారందరితోనూ తనకు టచ్ ఉందని ధనరాజ్ తెలిపారు.

ఇది చదవండి: అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us