AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

ఎన్టీఆర్ చివరి రోజు జనవరి 18, 1996న జరిగిన ఘటనలను ఆయన మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య వివరించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మృతికి కారణం, లక్ష్మీపార్వతి పాత్ర, కుటుంబ సభ్యుల స్పందన, పోస్ట్‌మార్టమ్ చేయకపోవడం వంటి అనేక విషయాలు చెప్పారు.

అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
Ntr
Ravi Kiran
|

Updated on: Apr 02, 2026 | 12:34 PM

Share

దివంగత ముఖ్యమంత్రి, గొప్ప నటుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) చివరి రోజు జనవరి 18, 1996 నాటి సంఘటనలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన నరసయ్య వివరించారు. 1994లో ఎన్టీఆర్ ఎన్నికలలో గెలిచినప్పుడు, లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారాలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది రోజుల ముందు నరసయ్యను కలిసిన ఎన్టీఆర్, మళ్లీ తన వద్దకు రావాలని కోరారు. అయితే, తన కెరీర్ ఎదుగుదల కోసం రంగారెడ్డి జిల్లా ఎస్పీగా పోస్టింగ్ కావాలని నరసయ్య కోరారు. ఎన్టీఆర్ ఆయన కోరికను మన్నించి, రంగారెడ్డికి బదిలీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి రంగారెడ్డి జిల్లా పెద్దది, ప్రెస్టీజియస్‌గా ఉండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నరసయ్యకు రంగారెడ్డి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఆయన రెండున్నర సంవత్సరాలు పనిచేశారు.

ఇది చదవండి: అతడి వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. ఓపెన్‌గా చెప్పేసిన నటి

1996 జనవరి 18న, తెల్లవారుజామున ఎన్టీఆర్ మరణించినట్లు ఉదయం 6 గంటలకు నరసయ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. ఆయన వెంటనే పంజాగుట్టలోని తన ప్రభుత్వ క్వార్టర్స్ నుంచి రోడ్డు నంబర్ 13లోని ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇల్లు ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమకు చెందినదని, ఒక ముఖ్యమంత్రికి తగినంత పెద్దది కాదని నరసయ్య పేర్కొన్నారు. మరణించిన సమయం, కారణం(గుండెపోటు లేదా ఇతరత్రా) ఇప్పటికీ స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు. ఇంట్లో ఉన్న లక్ష్మీపార్వతి, చిన్న కొడుకు జయశంకర్ కృష్ణకు కూడా మరణ వార్తను చెప్పలేదని, బదులుగా ఆమె ఇతరులకు ఫోన్లు చేసుకోవడం, ఐఏఎస్‌లను “సద్దుకోవడం” వంటి పనులు చేశారని, అలాగే కొందరు ఎమ్మెల్యేలకు “సూట్ కేసులు”(డబ్బు) పంపించారని ఆరోపణలు ఉన్నాయని నరసయ్య వివరించారు.

లక్ష్మీపార్వతి మొదట మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాలని పట్టుబట్టగా, అది చిన్న ఇల్లు కావడం వల్ల లక్షల మంది జనం వస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని నరసయ్య, పోలీస్ కమిషనర్ వి. అప్పారావుతో కలిసి ఆమెను ఒప్పించి, మృతదేహాన్ని లాల్ బహదూర్ స్టేడియంలోని ఓపెన్ గ్రౌండ్‌కు తరలించారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ కుమార్తెలు భువనేశ్వరి, పురంధరేశ్వరి శవానికి కొంత దూరంగా నిలబడి ఉన్నారు. నరసయ్య భార్యతో పాటు నన్నపనేని రాజకుమారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వనజాక్షిని తండ్రి మృతదేహం వద్దకు రప్పించి కూర్చోబెట్టారు. మధ్యాహ్నం విదేశాల నుంచి హరికృష్ణ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కొంత ధైర్యం పుంజుకుని బాధ్యతలు స్వీకరించారు.

ఎన్టీఆర్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, బీపీ, షుగర్, ఒకసారి పక్షవాతం, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటివి జరిగాయని నరసయ్య తెలిపారు. అయితే, ఆయన రోజుకు గంటన్నర నుంచి రెండు గంటల పాటు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండగలిగారని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా, గొప్ప నటుడిగా, లెజెండరీ ఫిగర్‌గా ఉన్న ఎన్టీఆర్‌కు పోస్ట్‌మార్టమ్ చేయడం సరికాదని కొందరు భావించారు. అయితే, అసలు కారణం తెలియాలంటే పోస్ట్‌మార్టమ్ చేయాల్సిందని, కొందరు ఏదో జరిగిందని అనుమానించారని నరసయ్య అన్నారు. ఆ స్థాయిలో పోస్ట్‌మార్టమ్ చేస్తే పరిస్థితి బాగోదని సాధారణ అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్ నిజాయితీకి మారుపేరని, పదివేల రూపాయల లంచం తీసుకున్న మంత్రిని అరెస్టు చేయించారని, మండల వ్యవస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇది చదవండి:  ఒక్క ఇడ్లీ కోసం ఆ కో-డైరెక్టర్ బూతులు తిట్టాడు.. తర్వాత వాడి పరిస్థితి ఇది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us