AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క ఇడ్లీ కోసం ఆ కో-డైరెక్టర్ బూతులు తిట్టాడు.. తర్వాత వాడి పరిస్థితి ఇది..

టాలీవుడ్ నటుడు సత్య ప్రకాష్ తన కెరీర్ తొలినాళ్ళలో పడ్డ కష్టాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి, ఫుడ్ విషయంలో అవమానం, కో-డైరెక్టర్ తిట్లు ఎదుర్కొన్న తీరును వివరించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

Tollywood: ఒక్క ఇడ్లీ కోసం ఆ కో-డైరెక్టర్ బూతులు తిట్టాడు.. తర్వాత వాడి పరిస్థితి ఇది..
Satya Prakash
Ravi Kiran
|

Updated on: Mar 31, 2026 | 1:22 PM

Share

టాలీవుడ్ నటుడు సత్య ప్రకాష్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎదుర్కున్న కష్టాలు, సవాళ్లు, అలాగే వాటిని అధిగమించిన తీరును ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన కెరీర్ ప్రారంభంలో చెన్నై నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఒక షూటింగ్ కోసం వచ్చారట. అప్పుడు ఆయనకు లభించిన జీతం కేవలం 2000 రూపాయలు. 200 రూపాయలు ముందే ఇచ్చి, మిగిలినది తర్వాత ఇస్తామన్నారు. ట్రైన్ టికెట్ మాత్రమే చేతిలో ఉండటంతో, బాత్రూమ్ దగ్గర కూర్చుని హైదరాబాద్‌కు ప్రయాణించినట్లు గుర్తుచేసుకున్నారు. అమీర్‌పేట్ లేదా పంజాగుట్టలో రూమ్ తీసుకున్నారు. అప్పుడు చెన్నై నుంచి వచ్చిన ఇతర బాడీ బిల్డర్స్, సీనియర్ నటులు తొమ్మిది మందితో కలిసి మూడు రూమ్‌లలో ఉండేవారు. సత్య ప్రకాష్ అప్పుడే పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్త వ్యక్తి కావడంతో, వారంతా ఉదయాన్నే హాట్ వాటర్, టీ, టిఫిన్ తేవాలని ఆదేశించేవారట.

అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆహారం విషయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. రెండు ఇడ్లీలు, ఒక వడ మాత్రమే ప్లేట్‌లో పెట్టగా, అదనంగా ఒక ఇడ్లీ కావాలని ప్రొడక్షన్ వ్యక్తిని అడిగితే, “మరో ఇడ్లీ ఏంటి? చాలు, రెండు ఇడ్లీలు, ఒక వడ పో” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ సంఘటన సత్య ప్రకాష్‌ను తీవ్రంగా కలచివేసింది. అంతేకాకుండా, ఒక ఫైట్ సీన్‌లో నటించేటప్పుడు, సరిగ్గా చేయలేకపోయారు. సుమన్, భానుచందర్, అరుణ్ పాండ్యన్ వంటి హీరోలు ఉన్న ఆ సినిమా షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ సత్య ప్రకాష్‌కు రావడం లేదని, వేరే ఆర్టిస్టును పెట్టమని చెప్పాడు. అప్పటికే ప్రాక్టీస్ చేసినా, నెర్వస్‌నెస్ వల్ల సరిగా చేయలేకపోయారు.

ఈ సమయంలో అక్కడే ఉన్న ఒక కో-డైరెక్టర్ స్మోక్ చేస్తూ, “ఇలాంటి ల** కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవ్వడానికి వచ్చేస్తుంటారు, అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతున్నది” అంటూ పక్కనే ఉన్న సత్య ప్రకాష్‌ను పరోక్షంగా దూషించాడు. ఈ అవమానం తనను ఎంతగానో బాధించిందని, అయితే కో-డైరెక్టర్ కావడంతో ఏమీ అనలేకపోయానని సత్య ప్రకాష్ పంచుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత, తన క్యారవాన్‌లో కూర్చున్న సత్య ప్రకాష్ దగ్గరకు, డైలాగ్‌లు అందించడానికి అదే కో-డైరెక్టర్ వచ్చాడు. అప్పుడు సత్య ప్రకాష్ ఆయనతో, “సార్, ఒక 12 ఏళ్ల క్రితం మీరు ఒక సినిమాకు కో-డైరెక్టర్‌గా ఉన్నారు, ఇవాళ కూడా కో-డైరెక్టరే. అప్పుడు నన్ను ఇలాంటి తిట్లతో అవమానించారు. దయచేసి కొత్తగా వచ్చిన వారిని ఇలాంటి తిట్లతో నిరుత్సాహపరచకండి. వారు ఎన్నో ఆశలతో వస్తారు” అని చెప్పినట్లు వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు