AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: అతడి వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. ఓపెన్‌గా చెప్పేసిన నటి

జబర్దస్త్ తన్మయ్ తన జీవితంలోని కష్టాలను పంచుకున్నారు. తలకు సర్జరీ అయినప్పుడు, తండ్రి మరణించినప్పుడు జబర్దస్త్ మిత్రుల నుంచి మద్దతు లభించలేదని తెలిపారు. కిర్రాక్ ఆర్పీ తనను మోసం చేశారని, ఆర్థికంగా సహాయం చేసినా తనకు కష్టమొచ్చినప్పుడు ఆయన పట్టించుకోలేదని తన్మయ్ పేర్కొన్నారు.

Jabardasth: అతడి వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. ఓపెన్‌గా చెప్పేసిన నటి
Jabardasth
Ravi Kiran
|

Updated on: Mar 31, 2026 | 1:45 PM

Share

జబర్దస్త్ షోలో లేడీ గెటప్‌లు వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలు, పరిశ్రమలో ఎదురైన సవాళ్లు, సహచర కళాకారుల నుంచి లభించని మద్దతుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ షోలో కనిపించే ఫ్రెండ్లీ నేచర్ కేవలం తెరపై మాత్రమేనని, నిజ జీవితంలో అలాంటి మద్దతు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన్మయ్ తన గతంలో జరిగిన ఒక ప్రమాదం గురించి వెల్లడించారు. కార్లో ఎయిర్‌పోర్ట్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో బర్రెని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఆ ప్రమాదంలో తలకు పెద్ద దెబ్బ తగిలి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఆ సమయంలో, తాను బ్రతికానా లేదా అనే విషయం కూడా ఎవరూ పట్టించుకోలేదని, ఎలాంటి సహాయం లభించలేదని తన్మయ్ గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత తన్మయ్ జీవితంలో మరో విషాదకర ఘటన జరిగింది. తన తండ్రి ఆకస్మిక మరణం గురించి మాట్లాడుతూ, ఆరోజు రాత్రి వీడియో కాల్‌లో మాట్లాడిన తండ్రి మరుసటి రోజు ఉదయం చనిపోయారని తెలియడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఆ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఏకైక వ్యక్తి నూకరాజు అని తన్మయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇమ్మాన్యుయేల్ షూటింగ్‌లో ఉండగా, నూకరాజు తన షూటింగ్ వదిలేసి, హైదరాబాద్ నుంచి తనను కార్లో తీసుకెళ్లి, తన తండ్రి అంత్యక్రియల వరకు తన చేయి వదలకుండా ధైర్యం చెప్పారని ఆయన వివరించారు. డబ్బుల పరంగా కానీ, మానసికంగా కానీ నూకరాజు తప్ప ఇంకెవరూ తనకు సహాయం చేయలేదని తన్మయ్ స్పష్టం చేశారు.

జబర్దస్త్ షోలోని తమ సహచర కళాకారుల నుండి మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తన్మయ్ వెల్లడించారు. కిర్రాక్ ఆర్పీతో తనకున్న సంబంధంపై మాట్లాడుతూ, ఒకప్పుడు అతన్ని సొంత అన్నలా భావించానని, ఆర్పీ విషయంలో తను చాలా సపోర్టివ్‌గా నిలబడ్డానని, ఆర్థికంగా కూడా సహాయం చేశానని తన్మయ్ తెలిపారు. ఆర్పీ వల్లే తాను అదిరింది షోకి కూడా వెళ్ళానని పేర్కొన్నారు. అయితే, తన వ్యక్తిగత కష్టాలు వచ్చినప్పుడు, ఆర్పీ పట్టించుకోలేదని, కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదని బాధపడ్డారు. జబర్దస్త్ నుంచి తాను బయటికి రావడానికి కిర్రాక్ ఆర్పీ కూడా ఒక కారణమని తన్మయ్ పరోక్షంగా సూచించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు