AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamra Badam: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాదం.. కిలో ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

చిన్నప్పటి నుండి మనం ఏదైనా మర్చిపోతే బాదం పప్పులు తిను, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని పెద్దలు చెప్పడం వినే ఉంటాం. ఇది నిజమే, ఎందుకంటే బాదంలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతాయి. అయితే సాధారణంగా మనం మార్కెట్లో కిలో బాదాన్ని రూ.800 నుండి 1000 పెట్టి కోంటాం. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే బాదం ఖరీదు తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక బాదమట. మరి దాని ధర ఎంతో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Apr 04, 2026 | 10:16 AM

Share
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాదం ఏది అంటే.. అదే మామ్రా బాదం.. ఇంటర్నేషనల్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మార్కెట్ గణాంకాల ప్రకారం, మామ్రా బాదం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పరిగణించబడుతుంది. దీని అరుదైన లభ్యత, అధిక పోషక విలువల వల్ల దీనికి అంత డిమాండ్ ఉంది

1 / 5
సాదారణ బాదం కన్నా ఇది ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే.. ప్రపంచవ్యాప్తంగా పండించే మొత్తం బాదంపప్పులలో మామ్రా బాదం వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. ఇది ప్రధానంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది.

2 / 5
వీటిని పండించడంలో ఎటువంటి రసాయనాలను వాడరు, ఇది పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తారు. సాధారణ బాదంతో పోలిస్తే మామ్రా బాదంలో రెట్టింపు కోవ్వులు, విటమిన్-E ఉంటాయి. అందుకే సాదారణ బాదం కన్నా మామ్రా బాదానికి డిమాండ్, ధర ఎక్కువ.

3 / 5
ఇక ధరల విషయానికి వస్తే మామ్రా బాదం సామాన్యులు కొనడం కొంచెం భారమే అని చెప్పాలి. ఎందుకంటే సాధారణ మామ్రా బాదం కిలో రూ. 3,000 నుండి రూ.5,000 వరకు ఉంటుంది. ఇక ప్రీమియం జంబో సైజ్ విషయానికి వస్తే దీని ధర కిలో  రూ. 6,000 ఉండవచ్చు. దీనితో పోలిస్తే మనం రోజూ తినే కాలిఫోర్నియా బాదం కేవలం చాలా తక్కువ. అది మనకు కేవలం రూ. 700 నుండి 900 మధ్యలోనే లభిస్తుంది.

4 / 5
సాధారణ బాదంతో పోలిస్తే మామ్రా బాదం రుచి కూడా వేరేగా ఉంటుంది. ఇది చాలా కరకరలాడుతూ, సహజమైన తీపిని కలిగి ఉంటుంది. దీనిలోని అధిక నూనె శాతం వల్ల తింటున్నప్పుడు చాలా రిచ్‌గా, క్రీమీగా అనిపిస్తుంది. దీని ఆకారం సాధారణ బాదంలా కాకుండా కొంచెం పడవ లాగా వంగి ఉంటుంది. దీని ఉపరితలం కూడా కొంచెం గరుకుగా ఉంటుంది. ఇదే దీని అసలైన గుర్తింపు.

5 / 5
Follow Us