హైదరాబాద్‌లో డ్రగ్స్ మూలాలను కట్టడి చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ. 2.35 లక్షల విలువైన 7.55 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.