ప్రకాశం జిల్లా చెదలవాడలో శ్రీ రఘునాయక స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గరుడ పక్షి ఆకాశంలో చెక్కర్లు కొట్టిన తర్వాతే తరంబ్రాలు పోసే ఆచారంలో భాగంగా, కళ్యాణ సమయంలో గరుడ పక్షి ప్రత్యక్షమై భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. ఈ అద్భుత దృశ్యం చూడటానికి భారీగా భక్తులు తరలివచ్చారు.