AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు.. ఇవి మూడ్ స్వింగ్స్ కాదు.. అంతకు మించి! ఈ లక్షణాలు ఉంటే

మనిషి అన్నాక కాసింత కోపం, సంతోషం, బాధ కలగడం సహజం. కానీ, కొందరిలో ఇవి అసాధారణంగా ఉంటాయి. ఆకాశమంత ఉత్సాహం నుంచి అమాంతం నిరాశలోకి సెకన్ల వ్యవధిలో వెళ్ళిపోతుంటారు. దీన్నే మెడికల్ భాషలో బైపోలార్ డిజార్డర్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకీ ఏంటి ఈ బైపోలార్ డిజార్డర్ అంటే.. క్లుప్తంగా తెలుసుకుందాం పదండి.

అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు.. ఇవి మూడ్ స్వింగ్స్ కాదు.. అంతకు మించి! ఈ లక్షణాలు ఉంటే
Bipolar Disorder Explained
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 1:33 PM

Share

బైపోలార్ డిజార్డర్ ఇది మెదడుకు సంబంధించిన ఒక తీవ్రమైన మానసిక జబ్బు. ఇందులో వ్యక్తి యొక్క ప్రవర్తన, శక్తి సామర్థ్యాలు, పనితీరులో విపరీతమైన మార్పులు వస్తాయి. దీనిని ప్రధానంగా రెండు దశలుగా విభజించవచ్చు. ఒకటి మేనియా హై స్టేజ్.. ఈ దశలో వ్యక్తి అద్భుతమైన శక్తి ఉన్నట్లు ఫీలవుతాడు. తనే శక్తిమంతుడినని, ఏదైనా చేయగలనని భావిస్తారు. రాత్రంతా పడుకోకపోయినా ఉత్సాహంగా ఉంటారు. ఆపకుండా వేగంగా మాట్లాడుతుంటారు. భారీగా షాపింగ్ చేయడం, అనాలోచితంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తారు.

సెకండ్ స్టేజ్

ఇక రెండవది డిప్రెషన్.. దీనిలో స్టేజ్ మేనియా ముగియగానే వ్యక్తి తీవ్ర నిరాశలోకి జారిపోతాడు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. గతంలో ఇష్టమైన పనులపై కూడా ఆసక్తి చచ్చిపోతుంది. జీవితం వ్యర్థమనే భావన కలిగి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ జబ్బు ఎలా వస్తోంది?

మరి దీనిని కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. ఇది కేవలం మానసిక ఒత్తిడి వల్ల మాత్రమే రాదు. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కుటుంబంలో ఇంతకు ముందు వెరైనా ఈ వ్యాధితో బాధపడి ఉంటే వారి నుంచి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మెదడులోని రసాయనాల అసమతుల్యత. తీవ్రమైన మానసిక గాయాలు లేదా అధిక ఒత్తిడి వల్ల ఈ మానసిక జబ్బు వస్తుందని చెబుతున్నారు.

చికిత్స ఎలా తీసుకోవాలి

ఖచ్చితంగా సరైన చికిత్స ఉంటే ఈ సమస్య ఉన్నవారు సాధారణ జీవితాన్ని గడపవచ్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ జబ్బు ఉన్న వారు సైకియాట్రిస్ట్ సూచన మేరకే మందులు వాడాలని సూచిస్తున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు కౌన్సెలింగ్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఈ వ్యాధిని అదుపులో ఉంచుతాయట.

మన చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి ప్రవర్తనతో ఇబ్బంది పడుతుంటే వారిని వెక్కిరించకుండా అది వారి ప్రవర్తన కాదు.. మెదడులో కలుగుతున్న అలజడి అని గుర్తించి. సరైన సమయంలో డాక్టరును సంప్రదించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు..మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు..మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. 'వాడు' అనేంత చనువు ఉంది..
నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. 'వాడు' అనేంత చనువు ఉంది..
బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?