లండన్‌లో ఉందనుకున్న కూతురు పూణేలో శవమై కనిపించింది..

×

లండన్‌లో ఉందనుకున్న కూతురు పూణేలో శవమై కనిపించింది..

లండన్‌లో ఎంబీఏ చదువుకుంటుందని భావించిన తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఎదురైంది. వారి కూతురు, 34 ఏళ్ల ముగ్ధా దేశ్‌ముఖ్‌, లండన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చి పూణేలో శవమై కనిపించడం కలకలం సృష్టించింది. 2021 జూలైలో ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లిన ముగ్ధా, 2022 ఆగస్టులో ఎవ్వరికీ చెప్పకుండా తిరిగి పూణేలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అక్టోబర్ 24 నుంచి ముగ్ధా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. స్విగ్గీ, జొమాటో యాప్‌ల ద్వారా ఆమె భారత్‌లోనే చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులను సంప్రదించగా, జొమాటో డెలివరీ వివరాల ఆధారంగా ఆమె ఉంటున్న ఫ్లాట్‌ను గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా, ముగ్ధా మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ముగ్ధా లండన్ నుంచి ఎందుకు తిరిగి వచ్చింది, ఆమె మరణానికి గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని టీవీ9 నివేదించింది.

Phani CH