AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadarsha Kutumbam: వివాదంలో ఆదర్శ కుటుంబం.. మీడియాకెక్కిన నిర్మాత

Aadarsha Kutumbam: వివాదంలో ఆదర్శ కుటుంబం.. మీడియాకెక్కిన నిర్మాత

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 12:33 PM

Share

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా పాటల వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా ‘జిమ్‌ జిమ్‌ తార’ పాటను సినిమాలో ఉపయోగించారని నిర్మాత మంచి వెంకట్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటను తాము నిర్మించిన ‘పర్ణశాల’ సినిమాలో అధికారికంగా ఉపయోగించామని తెలిపారు. అనుమతి లేకుండా పాటను వాడటం చిన్న సినిమాలకు నష్టం కలిగిస్తుందని, మరోసారి ఇలాగే జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వెంకీ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఆదర్శ కుటుంబం. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడో చిన్న వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా తమ సినిమాలోని పాటని.. ఆదర్శ కుటుంబం సినిమాలో వాడడం అన్యాయం అని.. నిర్మాత మంచి వెంకట్‌ మీడియాకెక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నిర్మాత మంచి వెంకట్‌ రీసెంట్‌గా పర్ణశాల మూవీని ప్రొడ్యూసర్ చేశారు.వై.జి.భరత్ దర్శకుడు.హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో.. తెరకెక్కిన ఈ సినిమాలో.. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన ‘జిమ్ జిమ్‌ తార’ పాటని అఫీషియల్‌గా వాడుకున్నారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా అఫీషియల్‌గా రిలీజ్ కూడా చేశారు. అయితే ఆ పాటనే ఇప్పుడు త్రివిక్రమ్ తన ఆదర్శకుంటుంబం సినిమాలో తన అనుమతి లేకుండా వాడారని వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రమోషనల్ సాంగ్‌ను.. ఇలా అనుమతి లేకుండా వాడడం వల్ల.. తమ సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్మాత వెంకట్ అంటున్నారు. లాంటి చర్యలు చిన్న సినిమాల మనుగడకు ఇబ్బందికరంగా మారుతాయని.. . ఇకపై తమ పాటను అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మిక్స్‌డ్‌ రియాక్షన్స్ తెచ్చుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాధిక సహాయకురాలి కొడుకు దారుణ హత్య..బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు

Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!

Rohit Elimination: సెలబ్రిటీల దెబ్బకు రోహిత్ ఎలిమినేషన్!

Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

Follow Us