Grey Hair: తెల్ల జుట్టు వెక్కిరిస్తుందా..? కిచెన్‌లో దొరికే వీటితో నిమిషాల్లో నల్లగా మార్చుకోండి!
తెల్ల జుట్టు సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? దీని కోసం కెమికల్స్ ఉన్న ఖరీదైనా హెయిర్ డైలు వాడుతున్నారా?.. జస్ట్ వెయిన్ అవన్నీ అవసరం లేదు.మీ ఇంట్లో దొరికే బియ్యం, మెంతులు ఉపయోగించి తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇంట్లోను తెల్ల జుట్టును సులభంగా నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మారుతున్న లైఫ్‌స్టైక్, ఆహారకు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఈ తెల్ల జుట్టు, జుట్టు రాలడం కూడా ఒకటి. 10లో సుమారు 6గురు ఈ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు వేల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్‌లో దొరికే ఖరీదైన హెయిర్ డైస్ వాడుతున్నారు. కానీ మన కిచెన్‌లో దొరికే బియ్యం, మెంతులు వంటి దాన్యాలతో ఇంట్లోనే సహజంగా మనం తెల్ల జుట్టును సమస్యకు చెక్ పెట్టవచ్చని చాలా మందికి తెలియదు. పూరతన కాలం పద్దతి అయినా ఈ మెంతులు, బియ్యాన్ని ఉపయోగించి జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో చూద్దాం
బియ్యం, మెంతులతో చేసే హెయిర్ డైకు కావలసిన పదార్థాలు
- ఒక పిడికెడు బియ్యం
- అర పిడికెడు మెంతులు, అంటే మీరు ఎంత బియ్యం తీసుకుంటారో అందులో సగం
- మీ జుట్టుకు సరిపడా ఆవనూనె లేదా కొబ్బరి నూనె ఇవి మాత్రమే ఉంటే సరిపోతుంది
తయారీ విధానం
ఈ హెయిర్ డై తయారు చేసుకునేందుకు మీరు ముందుగా ఒక ఇనుప పెనం తీసుకుని అందులో బియ్యం, మెంతులు వేయండి. ఇవి పూర్తిగా నల్లగా మారే వరకు చిన్న మంట మీద బాగా వేయించాలి. వేయించిన మిశ్రమం చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే ఇనుప బాణలిలో మీకు సరిపడా ఆవనూనె లేదా కొబ్బరి నూనె పోయాలి. అందులో మీరు ముందుగానే చేసుకున్న బియ్యం-మెంతుల పొడిని కలిపి, చిన్న మంట మీద ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. అంతే మీ సహజ హెయిర్ డై రెడీ అయినట్టే
ఎలా ఉపయోగించాలి?
మీరు తయారు చేసుకున్న ఈ సహజమైన హెయిర్ ప్యాక్‌ను జుట్టుకు పటించి బాగా అప్లై చేయాలి. ఒక 30-45 నిమిషాల పాటు ఉంచి స్నానం చేస్తే సరిసోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఇది కేవలం రంగు కోసమే కాకుండా, జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
Note: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. దీనిని ప్రయత్నించే ముందు చర్మ అలర్జీలు ఉన్నవారు లేదా ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
