AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాముడిగా రణబీర్ సెట్ అవ్వలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మణుడు

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు, కన్నడ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా హీరో రణబీర్ కపూర్ నటించగా సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది.

రాముడిగా రణబీర్ సెట్ అవ్వలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మణుడు
Ramayanam
Rajeev Rayala
|

Updated on: Apr 04, 2026 | 3:37 PM

Share

సినిమా ఇండస్ట్రీలో రామాయణం పై ఎన్నో సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. రామాయణ ఇతిహాసంపై వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమా తెరకెక్కితుంది. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే సీతమ్మగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే తాజాగా రామాయణంనుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.

రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతంగా అనిపించారు. అలాగే సీతమ్మగా సాయి పల్లవి సెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో రావణుడిగా స్టార్ హీరో యశ్ నటిస్తుండగా.. అలాగే సహా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రావణుడి భార్య మండోదరిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్,అలాగే రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని తెలుస్తుంది. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే రామాయణం సినిమా టీజర్ పై రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రతో మెప్పించిన సునీల్ లహరి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాముడిగా రణబీర్ కపూర్ ను అంగీకరించలేకపోతున్నా అన్నారు. రణబీర్ కపూర్ మంచి నటుడే కానీ రాముడికి ఉండాల్సిన దైవికమైన అమాయకత్వం రణబీర్ లో లేదు. రణ్‌బీర్ ముఖంపై ఒక విధమైన మెచ్యూరిటీ కనిపిస్తోంది, అది రాముడి పాత్రకు సరిపోదు అని సునీల్ అన్నారు. అదేవిధంగా మనం దేవుళ్లుగా ఆరాధించే పాత్రలను తెరపై చూపించేటప్పుడు, ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవించాలి. ప్రయోగాలు చేసే క్రమంలో ఆ పాత్రల మూలాలను దెబ్బతీయకూడదు అంటూ చెప్పుకొచ్చారు సునీల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు