దెబ్బ మీద దెబ్బ తగిలి రోడ్డున పడ్డాను.. జబర్దస్త్ కమెడియన్ రఘు కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
జబర్దస్త్ నటుడు రోలర్ రఘు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించాడు. కామెడీ విలన్ గా నవ్వులు పూయించాడు రోలర్ రఘు. అలాగే జబర్దస్త్ లోనూ పలు స్కిట్స్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు.

జబర్దస్త్ కమెడియన్ రోలర్ రఘు గుర్తున్నాడా.? చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు రఘు. తనదైన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాడు. అడపదడపా సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన ఆర్థిక పరిస్థితులను, వ్యక్తిగత పోరాటాన్ని పంచుకున్నాడు. కోట్ల రూపాయల నష్టాలు, నమ్మిన వారి చేతిలో మోసపోవడం, షేర్ మార్కెట్‌లో దెబ్బతినడం వంటి పలు ఎదురుదెబ్బలు తనను పూర్తిగా కుంగదీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలి రోడ్డున పడ్డాను అని రఘు అన్నారు. ఈ కష్టకాలంలో మూడు నెలల పాటు తన బెడ్‌రూమ్‌కే పరిమితమై బయటకు రాలేకపోయానని తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో తన భార్యనే తనకు వెన్నెముక అని, ఆమె ప్రోత్సాహంతోనే తాను తిరిగి నిలబడగలిగానని రఘు చెప్పారు. 2012 నుంచి వెనక్కి తిరిగి చూడకుండా జీవితంలో ముందుకు సాగానని ఆయన అన్నారు. తన ఆర్థిక కష్టాల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేశారన్న వార్తలను రోలర్ రఘు గట్టిగా ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమని, తాను ఎవరి సహాయం తీసుకోలేదని, తన తల్లిదండ్రులకు, భార్యకు కూడా తన నష్టాల గురించి చాలా కాలం పాటు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనకు ఎప్పుడూ రాలేదని రఘు అన్నారు. పోగొట్టుకున్న డబ్బు గురించి చింతించకుండా, వర్తమానంపై దృష్టి సారించి కష్టపడి తిరిగి సంపాదించుకోవడమే తన తత్వమని ఆయన తెలిపారు.
తన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, తాను ఏదో సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగానని రఘు తెలిపారు. ప్రస్తుతం తనకు డబ్బు, మనశ్శాంతి, కుటుంబం, కొంతమంది మంచి స్నేహితులు ఉన్నారని, అంతకంటే జీవితంలో ఇంకేం కావాలని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తాను కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుకుగా ఉన్నానని, అయితే ఆర్మీలో ఉన్న తన తండ్రికి అది ఇష్టం లేదని కూడా రోలర్ రఘు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన జీవితంలోని కష్టాల నుండి నేర్చుకున్న పాఠాలతో, ఇప్పుడు తాను ఆనందంగా ఉన్నానని, ఒక సంతోషకరమైన వ్యక్తిగా జీవిస్తున్నానని రోలర్ రఘు ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
